వాణిదేవి ఎంపికతో బీజేపీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది.. ఆ సవాల్‌పై చర్చకు రమ్మంటే పారిపోతున్నారన్న మంత్రులు

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రచారంలో స్పీడ్‌..

వాణిదేవి ఎంపికతో బీజేపీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది.. ఆ సవాల్‌పై చర్చకు రమ్మంటే పారిపోతున్నారన్న మంత్రులు
Follow us

|

Updated on: Feb 27, 2021 | 4:32 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రచారంలో స్పీడ్‌ పెంచింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రులు ప్రచార రంగంలోకి దిగిపోయారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ టీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె శ్రీమతి సురభి వాణీదేవిని టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గా అవకాశం ఇచ్చినందుకు అన్ని వర్గాల మద్దతు లభిస్తుందన్నారు. పీవీ నరసింహారావు మారుమూల ప్రాంతం నుండి వచ్చి దేశ ప్రధానిగా సేవలు అందించారని మంత్రి వేముల గుర్తు చేశారు. సురభి వాణీదేవి విద్యారంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నారని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సురభి వాణీదేవిని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా అభ్యర్థిగా నిలపడం తో బీజేపీ పార్టీ సందిగ్ధంలో పడిందని ఎద్దేవా చేశారు. కులం,మతం పేరుతో ఓటు అడుగుదామని అనుకున్న బీజేపీ ఖంగుతిన్నది. టీ ఆర్ ఎస్ పార్టీ ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ… పార్టీ తో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి…కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అనేక నివేదికల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 2016 రూపాయల పింఛన్ ఎక్కడైనా ఉందా?? అని వేముల ప్రశ్నించారు. పేదల సంక్షేమ పథకాల గురించి బండి సంజయ్ మాట్లాడడు…తెలంగాణ లో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు… ప్రజల సంక్షేమ పథకాల గురించి చర్చ కు రమ్మంటే అడ్రస్ లేడు.. ఫించన్ లో కేంద్ర ప్రభుత్వ వాటా 200 రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని గతంలో సవాల్‌ చేస్తే బీజేపీ నేతలు పారిపోయారని మంత్రి వేముల ఎద్దేవా చేశారు.

మాజీ ప్రధాని పీవి నరసింహారావు కుటుంబానికి గుర్తింపు ఉండాలని, గౌరవించుకోవాలని సీఎం ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు… పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహణ, పీవీ పుట్టిన గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రజల జీవన విధానంలో గణనీయంగా మార్పు వచ్చిందన్నారు. విద్యుత్, తాగునీరు, సాగునీరు, సంక్షేమం, వంటి రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రగతి సాధించిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యావంతులు ఈ మార్పును గమనించాలని కోరారు. పని చేసే పార్టీ ని, వ్యక్తులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సురభి వాణి దేవిని గెలిపించాలని కోరారు. సోషల్ మీడియా లో దుష్ప్రచారాన్ని టీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు.

Read more:

కేంద్రానివన్నీ తెలంగాణ కాపీ పథకాలే.. విభజన హామీలు నెరవేర్చని పార్టీలను ఓడించాలన్న హరీశ్‌రావు