APOSS 10th, Inter Admissions: ఏపీ ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

దరికం వల్లనో.. వ్యక్తిగత కారణాల వల్లనో చదువు మధ్యలోనే ఆపేసిన వారికి సువర్ణావకాశం. 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు సార్వత్రిక విద్యా పీఠం దరఖాస్తులు కోరుతోంది. జులై 31 నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యా పీఠం డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఓ ప్రటకనలో తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 4 వరకు దరఖాస్తు..

APOSS 10th, Inter Admissions: ఏపీ ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
APOSS Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 31, 2024 | 4:04 PM

అమరావతి, జులై 31: పేదరికం వల్లనో.. వ్యక్తిగత కారణాల వల్లనో చదువు మధ్యలోనే ఆపేసిన వారికి సువర్ణావకాశం. 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు సార్వత్రిక విద్యా పీఠం దరఖాస్తులు కోరుతోంది. జులై 31 నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యా పీఠం డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఓ ప్రటకనలో తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు.

ఆగస్టు 1 నుంచి తెలంగాణ డీఈఈ సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన

తెలంగాణ డీఈఈ సెట్‌ 2024లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ధ్రువపత్రాల పరిశీలన తేదీలు విడుదలయ్యాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఇంజినీరింగ్‌ తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తి

ఏపీలో ఇంజినీరింగ్‌ చివరి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ పూర్తైంది. చివరి విడతలో మొత్తం 17,575 సీట్లు భర్తీ అయ్యాయి. అంతేకాకుండా తుది విడత కౌన్సెలింగ్‌లో 26,162 మంది అభ్యర్ధులు తమ కోర్సులు, కాలేజీలను (స్లైడింగ్‌) మార్చుకున్నారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 86 శాతం సీట్లు భర్తీ అయినట్లు కన్వీనర్‌ గణేష్‌ కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు, కాలేజీల్లో కలిపి కన్వీనర్‌ కోటా కింద 1,39,254 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 1,20,303 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక ప్రైవేట్‌ యూనివర్సిటీలో 7,950 సీట్లకు గాను 7,826 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కాలేజీల్లో 1,24,323 సీట్లు ఉండగా.. వీటిల్లో 1,06,324 మంది సీట్లు పొందారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో 6,981 సీట్లు ఉండగా.. వాటిలో 6,153 భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 3లోగా సంబంధిత కాలేజీల్లో చేరాలని కన్వీనర్‌ గణేష్‌ కుమార్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.