TGPSC Exam Dates: తెలంగాణలో సీడీపీవో, ఈవో పోస్టుల రాత పరీక్ష తేదీలు విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమశాఖలో శిశు అభివృద్ధి సంక్షేమ అధికారులు (సీడీపీవో) పోస్టులు 23, ఈవో పోస్టులు 181 భర్తీకి టీజీపీఎస్సీ రీఎగ్జాం షెడ్యూలును ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో గతంలో ఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షను కమిషన్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విచారణ బృందం, ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా 2023లో నిర్వహించిన ఈ రాతపరీక్షలను కమిషన్‌ రద్దు చేసి, సీడీపీవో పోస్టుల ఎంపిక..

TGPSC Exam Dates: తెలంగాణలో సీడీపీవో, ఈవో పోస్టుల రాత పరీక్ష తేదీలు విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే
TGPSC Exam Dates
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 31, 2024 | 3:34 PM

హైదరాబాద్‌, జులై 31: తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమశాఖలో శిశు అభివృద్ధి సంక్షేమ అధికారులు (సీడీపీవో) పోస్టులు 23, ఈవో పోస్టులు 181 భర్తీకి టీజీపీఎస్సీ రీఎగ్జాం షెడ్యూలును ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో గతంలో ఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షను కమిషన్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విచారణ బృందం, ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా 2023లో నిర్వహించిన ఈ రాతపరీక్షలను కమిషన్‌ రద్దు చేసి, సీడీపీవో పోస్టుల ఎంపిక జాబితాను క్యాన్సిల్‌ చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ పోస్టులకు నియామక పరీక్షలను మళ్లీ నిర్వహించనున్నారు. సీడీపీవో పోస్టులకు 2025 జనవరి 3, 4 తేదీల్లో ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జరుగుతాయి. ఈవో పోస్టులకు జనవరి 6, 7 తేదీల్లో జరుగుతాయి. ఈ రెండు పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతాయి. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రాతపరీక్షలకు వారం రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. నార్మలైజేషన్‌ విధానంలో మార్కులు లెక్కించి, ర్యాంకులు ప్రకటిస్తామని తెలిపారు.

యూపీఎస్సీ ఈఎస్‌ఈ, సీఎంఎస్‌ఈ 2024 ఫలితాలు విడుదల.. మెరిట్‌ లిస్ట్ ఇదే

యూపీఎస్సీ ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2024’ మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను కమిషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఏడాది జూన్‌ 23వ తేదీన రాత పరీక్ష నిర్వహించించింది. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 167 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి పర్సనాలిటీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల ఫలితాలతోపాటు 827 మెడికల్ ఆఫీసర్, జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ‘కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024’ పరీక్ష ఫలితాలను కూడా యూపీఎస్సీ వెల్లడించింది. ఈపరీక్ష జులై 14న నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

యూపీఎస్సీ ఈఎస్‌ఈ 2024 మెయిన్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ సీఎంఎస్‌ఈ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో