AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trainee IAS Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్‌ షాక్‌.. IAS కొలువు రద్దు చేసిన యూపీఎస్సీ! పరీక్షలకు శాశ్వతంగా డీబార్‌

పుణేలో ట్రైయినీ కలెక్టర్‌గా ఉద్యోగం చేస్తూ వివాదంలో ఇరుక్కున్న పూజా ఖేద్కర్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. పూజా ఖేద్కర్‌ సివిల్స్‌ అభ్యర్ధిత్వాన్ని రద్దు చేస్తూ UPSC బుధవారం (జులై 31) కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా UPSC పరీక్షలు రాయకుండా ఆమెపై నిషేధం (డిబార్‌) విధించింది. తప్పుడు డాక్యుమెంట్లతో పూజా ఖేద్కర్‌ ఉద్యోగం పొందినట్టు దర్యాప్తులో తేలింది. UPSC నిబంధనలను ఉల్లంఘించడంతో..

Trainee IAS Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్‌ షాక్‌.. IAS కొలువు రద్దు చేసిన యూపీఎస్సీ! పరీక్షలకు శాశ్వతంగా డీబార్‌
Trainee IAS Puja Khedkar
Srilakshmi C
|

Updated on: Jul 31, 2024 | 5:20 PM

Share

న్యూఢిల్లీ, జులై 31: పుణేలో ట్రైయినీ కలెక్టర్‌గా ఉద్యోగం చేస్తూ వివాదంలో ఇరుక్కున్న పూజా ఖేద్కర్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. పూజా ఖేద్కర్‌ సివిల్స్‌ అభ్యర్ధిత్వాన్ని రద్దు చేస్తూ UPSC బుధవారం (జులై 31) కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా UPSC పరీక్షలు రాయకుండా ఆమెపై నిషేధం (డిబార్‌) విధించింది. తప్పుడు డాక్యుమెంట్లతో పూజా ఖేద్కర్‌ ఉద్యోగం పొందినట్టు దర్యాప్తులో తేలింది. UPSC నిబంధనలను ఉల్లంఘించడంతో పూజా ఖేద్కర్‌పై చర్యలు తీసుకున్నారు. పూణేలో పోస్టింగ్‌ రాగానే ఆమె పలు సౌకర్యాలు కోసం డిమాండ్‌ చేయడంతో వివాదం రాజుకుంది. మెల్లమెల్లగా ఆమెకు సంబంధించి పలు అక్రమాలు వెలుగు లోకి వచ్చాయి. తప్పుడు ఓబీసీ సర్టిఫికేట్‌తో పాటు దృష్టి లోపాలకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించి ఇంటర్వ్యూకు హాజరైనట్టు గుర్తించారు. అంతేకాకుండా పూజా ఖేద్కర్‌ తల్లి మనోరమ రైతులను గన్‌తో బెదిరించిన వ్యవహారంపై కూడా రచ్చ జరిగింది. ఈ కేసులో మనోరమను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ సీఎస్‌ఈ 2022 నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు తేలడంతో దోషిగా కమిషన్‌ నిర్ణయించింది. యూపీఎస్సీ పరీక్షల్లో తన పేరును మాత్రమేకాకుండా, తన తల్లిదండ్రుల పేర్లు కూడా మార్చుకున్నట్లు గుర్తించారు. అలాగే యూపీఎస్సీ అటెంప్ట్‌ విషయంలోనూ ఆమె నిబంధనలను తుంగలో తొక్కినట్లు గుర్తించారు. ఈ క్రమంలో 2009 నుంచి 2023 వరకు మొత్తం 15 సంవత్సరాల ప్రయత్నాల సంఖ్యకు సంబంధించి 15 వందలకు పైగా అభ్యర్ధుల డేటాను యూపీఎస్సీ పరిశీలించింది. ఈ డేటాలో పూజ మనోరమ దిలీప్‌ ఖేద్కర్‌ మినహా ఎవ్వరూ అనుమతించిన దానికంటే అదనంగా ఎవరూ ఎక్కువ ప్రయత్నాలలో పరీక్ష రాసినట్లు గుర్తించలేదు.

అసలు వివాదం ఏంటంటే?

పూజా ఖేడేకర్ (34) తన ప్రైవేట్ ఆడి కారులో బీకాన్‌ను అనధికారికంగా ఉపయోగించడంతో పాటు, ప్రత్యేక కార్యాలయం, అధికారిక కారును డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీడియా ఫోకస్‌ ఆమెపైకి మళ్లింది. మొదట్లో పూణేలో ఉన్న ఖేద్కర్‌ను వివాదాల నేపథ్యంలో ఆమెను పూణే జిల్లా కలెక్టర్ వాషిమ్‌కు బదిలీ చేశారు. అయినా ఆమెను చుట్టుముట్టిన వివాదాలు వీడలేదు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)కి ఆమెను తిరిగి పిలిపించి, ఆమె ‘జిల్లా శిక్షణా కార్యక్రమాన్ని’ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. ఆమె సమర్పించిన వైకల్యం, OBC సర్టిఫికెట్ల ప్రామాణికత కోసం విచారణ జరపగా.. అవన్నీ నకిలీ ద్రువీకరణ పత్రాలుగా దర్యాప్తులో తేలింది. దీంతో యూపీఎస్సీ ఆమె సివిల్స్‌ అభ్యర్దిత్వాన్ని రద్దు చేయడంతోపాటు, భవిష్యత్తులో ఏ పరీక్షలు రాయకుండా శాశ్వతంగా డీబార్‌ చేస్తున్నట్లు బుధవారం (జులై 31) ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.