AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భర్తను బురిడీ కొట్టించి.. ఇద్దరు పిల్లలను వదిలేసి మామతో కోడలు జంప్‌..

బంధుత్వాలను తలదించుకునే ఈ పెళ్లి గురించి విని అందరూ షాక్ అవుతున్నారు. ముందుగా ఇద్దరూ పది రోజుల పాటు ఇద్దరూ పరారీలో ఉన్నారని సమాచారం. ఆ తరువాత గ్రామానికి చేరుకుని పూలమాలలు వేసి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ ముందుగానే పెళ్లికి కావాల్సిన దండలు, సింధూరం తమ వెంట తెచ్చుకున్నారు. హరిశంకర్ వరుడిగా వచ్చేసరికి కోడలు కూడా పెళ్లికూతురు వేషం వేసుకుని గుడికి చేరుకుంది.

Viral Video: భర్తను బురిడీ కొట్టించి.. ఇద్దరు పిల్లలను వదిలేసి మామతో కోడలు జంప్‌..
Man Elope With Son Wife
Jyothi Gadda
|

Updated on: Jul 31, 2024 | 9:53 PM

Share

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమ పేరుతో వావివరుసలు మరచిపోతున్నారు. ప్రేమించడం తప్పు కాదు.. కానీ, వావివరసలు మర్చిపోయి ప్రేమిస్తేనే అది జుగుస్పాకరంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఛెండాలపు పనులకు సంబంధించిన వార్తలు అనేకం వార్తల్లో వస్తున్నాయి. ఎలాంటి బంధాలు, బంధుత్వాలను పట్టించుకోకుండా, ఇతర అభిప్రాయాల్ని పట్టించుకోకుండా కొందరు ప్రేమ గుడ్డిది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వావివరసలు లేకుండా ప్రేమించేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అలాంటి వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ మామ తన కోడలితోనే ప్రేమలో పడ్డాడు. తన కొడుకు భార్య అనే ఇంగితం కూడా లేకుండా కోడలితో ప్రేమాయణం నడిపించాడు. అటు కోడలు కూడా భర్త కళ్లుగప్పి..తండ్రి స్థానంలో ఉన్న మామతో రాసలీలలు కొనసాగించింది. చివరకు.. వీళ్లిద్దరు కలిసి అతనికి శఠగోపం పెట్టి, ఇంటి నుంచి పారిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని మౌలో ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మౌలోని ఘోసి కొత్వాలికి చెందిన సరాయ్ గ్రామంలో ఓ మామ తన సొంత కోడలుతో లేచిపోయాడు. 70 ఏళ్ల వ్యక్తి తన సొంత కోడలుతో ప్రేమలో పడ్డాడు. మామ, కోడలు పరారీలో ఉండడంతో ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. బంధుత్వం తెంచుకున్న తర్వాత వీళ్లిద్దరూ ఇల్లు వదిలి ఆచూకీ లేకుండా పారిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. అయితే, కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ తిరిగి స్వగ్రామానికి వచ్చారు. ఊళ్లో ఉన్న ఓ ఆలయానికి చేరుకున్నారు. సొంతూరి గుడిలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వార్త విని అందరూ షాక్‌ అయ్యారు.. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఆలయానికి చేరుకుని ఈ వింత వివాహాన్ని వీడియోలు,ఫోటోలు రికార్డ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

70 ఏళ్ల వృద్ధుడు తన వయసులో సగం ఉన్న 35 ఏళ్ల కోడలును పెళ్లి చేసుకున్నాడు. సారాయి గ్రామానికి చెందిన కోటేదార్ అనే ఈ వృద్ధుడి పేరు హరిశంకర్. హరిశంకర్‌కు ఐదుగురు కుమారులు, పెద్ద కొడుకు భార్యతో ఎప్పుడు ప్రేమలో పడ్డాడో ఎవరికీ తెలియదు. ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి పారిపోయారు. కోడలుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది.

బంధుత్వాలను తలదించుకునే ఈ పెళ్లి గురించి విని అందరూ షాక్ అవుతున్నారు. ముందుగా ఇద్దరూ పది రోజుల పాటు ఇద్దరూ పరారీలో ఉన్నారని సమాచారం. ఆ తరువాత గ్రామానికి చేరుకుని పూలమాలలు వేసి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ ముందుగానే పెళ్లికి కావాల్సిన దండలు, సింధూరం తమ వెంట తెచ్చుకున్నారు. హరిశంకర్ వరుడిగా వచ్చేసరికి కోడలు కూడా పెళ్లికూతురు వేషం వేసుకుని గుడికి చేరుకుంది. వీరి పెళ్లి వార్త తెలియడంతో ఆలయం వద్దకు భారీగా జనం గుమిగూడారు. రద్దీ పెరగడంతో పోలీసులు కూడా వచ్చారు. కానీ, స్థానికులతో పాటు పోలీసులు కూడా ఈ పెళ్లిలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై