AP High Court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది..

AP High Court Recruitment: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారి చేశారు. అమరావతిలోని హైకోర్టులో జడ్జీలకు, రిజిస్ట్రార్‌లకు సహాయకులుగా కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీ పోస్టులను...

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది..
Ap High Court
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 20, 2021 | 7:44 AM

AP High Court Recruitment: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారి చేశారు. అమరావతిలోని హైకోర్టులో జడ్జీలకు, రిజిస్ట్రార్‌లకు సహాయకులుగా కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ రేపటితో (21-07-2021) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీ పోస్టులు కలిపి మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకునే వారు.. ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన ఇంగ్లిష్, షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌ (నిమిషానికి 180 పదాలు) అర్హత కలిగి ఉండాలి. * అలాగే ఇంగ్లిష్‌లో నిమిషానికి 150 పదాలు షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ నైపుణ్యాలున్న అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు. * అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 37,100 జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు తమ దరఖాస్తులను రిజిస్ట్రార్‌(అడ్మినిస్ట్రేషన్‌), హైకోర్టు ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు–522237 అడ్రస్‌కు పంపించాలి. * అభ్యర్థులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణ రేపటితో (21-07-2021) ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: ICAR Recruitment 2021: B.COM, BBA చేసిన వారికి సువర్ణవకాశం..! ICARలో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్..

BPNL Recruitment 2021: పశుసంవర్ధక శాఖ సంస్థలో భారీ ఉద్యోగ నియామకాలు.. టెన్త్ అర్హత.. ఎలా అప్లై చేసుకోవాలంటే

NIAB Recruitment: హైదరాబాద్‌లోని ఎన్ఐఏబీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.