CBSE Class 10th Result 2021: నేడు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు..! సాయంత్రానికి వెలువడే అవకాశం..

CBSE Class 10th Class Result: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌

CBSE Class 10th Result 2021: నేడు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు..! సాయంత్రానికి వెలువడే అవకాశం..
Cbse 10th Results
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 20, 2021 | 10:44 AM

CBSE Class 10th Class Result: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (నేడు) వెలువడనున్నట్లు పేర్కొంటున్నారు. ఈరోజు సాయంత్రం నాటికి ఫలితాలను ప్రకటించే అవకాశముందని పలు మీడియాలు పేర్కొంటున్నాయి. అయితే.. పదో తరగతి ఫలితాలపై సీబీఎస్ఈ, కేంద్ర విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ అంతకుముందు బోర్డు చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు ఫలితాలు వెల్లడయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కావున ఈ రోజు సాయంత్రం నాటికి ఫలితాలు విడుదల అవుతాయని పేర్కొంటున్నారు. అయితే.. బోర్డు నుంచి అధికారిక ప్రకటన లేనప్పటికీ, విద్యార్థులు తమ 10వ తరగతి ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

ఈ ఫలితాలను సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌తోపాటు డిజిలాకర్‌ యాప్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లో తనిఖీ చేసుకోవచ్చు. దీంతోపాటు డిజిలాకర్‌ యాప్‌లో ఫలితాలు ప్రత్యేకంగా చూడవచ్చు. వ్యక్తిగత వివరాలను వైబ్‌సైట్‌లో పొందుపరిస్తే సరిపోతుంది.

కాగా.. అంతకుముందు జూలై 20 నాటికల్లా ఫ‌లితాల‌ను వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్టు వెల్లడించింది. జూలై 20న పదో తరగతి పరీక్షల ఫలితాలు, జూలై 31 నాటికి 12వ తరగతి ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే.. ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు.. కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మళ్లీ పరీక్ష రాసేలా అవకాశం ఇస్తామని సీబీఎస్ఈ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా దీనికోసం సీబీఎస్ఈ మళ్లీ నోటిఫికెషన్ ఇవ్వనుంది. పరీక్షలకు 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచామివ్వనుంది.

Also Read:

JEE Mains 2021: నేటి నుంచి జేఈఈ మెయిన్‌ మూడో విడత పరీక్షలు.. బిట్‌శాట్‌, ఎంసెట్‌ పరీక్ష తేదీల క్లాష్‌!

Petrol Diesel Price: వరుసగా మూడో రోజుల ఇంధన ధరల పెరుగుదలకు బ్రేక్.. ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా ఉన్నాయి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..