JEE Mains 2021: నేటి నుంచి జేఈఈ మెయిన్‌ మూడో విడత పరీక్షలు.. బిట్‌శాట్‌, ఎంసెట్‌ పరీక్ష తేదీల క్లాష్‌!

ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు మొదలుకానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వం పలు అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది.

JEE Mains 2021: నేటి నుంచి జేఈఈ మెయిన్‌ మూడో విడత పరీక్షలు.. బిట్‌శాట్‌, ఎంసెట్‌ పరీక్ష తేదీల క్లాష్‌!

JEE Mains 2021: ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు మొదలుకానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వం పలు అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి జేఈఈ మెయిన్‌ మూడవ విడత పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతలుగా నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే కాగా దీనిలో భాగంగా ఇప్పటికే మొదటి రెండు సెషన్లను నిర్వహించింది.

మూడు, నాలుగో సెషన్లు ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎన్‌టీఏ మూడో విడుత పరీక్ష తేదీలను నిర్వహిస్తుంది. ఆన్​లైన్ లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 7.09 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఒకటిన్నర లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.

ఈ నెల 20, 22, 25, 27 తేదీల్లో ఆన్ లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు గంటన్నర ముందు నుండే విద్యార్థులను అనుమతించనున్నారు. దేశవ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలు జరగనుండగా ఏపీలో 20, తెలంగాణలో 11 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నిబంధనలతో పరీక్షలను పకడ్బంధీగా నిర్వహిచేందుకు పరీక్ష కేంద్రాలను పెంచారు.

ఇవాళ్టి నుంచి ప్రారంభమై.. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు తదితర విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్‌ రాయాల్సి ఉంటుంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి కూడా మెయిన్‌ పరీక్షలో ర్యాంకు అవసరం. కాగా, ఆగస్టు 4, 5, 6 తేదీల్లో బిట్స్‌పిలానీ ఎంట్రన్స్‌ పరీక్ష బిట్‌శాట్‌ జరగనుంది.

ఇదిలావుంటే, రాష్ట్రంలో ఎంసె ట్‌ (ఇంజనీరింగ్‌) పరీక్షలు కూడా అవే తేదీల్లో జరగనున్నాయి. ఈ రెండు పరీక్షలూ రాసే విద్యార్థులు చాలామంది ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని.. ఎంసెట్‌ తేదీని మార్చుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. ఈ మేరకు బిట్‌శాట్‌ రాసే విద్యార్థులు ఎంసెట్‌ పరీక్ష కోసం ప్రత్యామ్నాయ తేదీలను ఎంచుకోవాలని ఎంసెట్‌ కన్వీనర్‌ సోమవారం సూచించారు.

Read Also…  NIA Raids: తెలంగాణలో ఎన్‌ఐఏ కలకలం.. 5 జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు… భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం!

Click on your DTH Provider to Add TV9 Telugu