AP DSC Notification: ఏపీ డీఎస్సీ-2023 నోటిఫికేషన్.. ఆగస్టులో విడుదలకు కసరత్తులు
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ..
అమరావతి: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం (జులై 11) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆగస్టులో డీఎస్సీ ప్రకటన వెలువడే అవకాశముందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కసరత్తు జరుగుతోందని మంత్రి బొత్స తెలిపారు.
కాగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గత ఏప్రిల్‌లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయుల బదిలీలపై సమీక్షించామని, బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి బొత్సా తెలిపారు
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.