AP TET 2024: ఏపీ టెట్‌ పరీక్ష తేదీలు మారాయోచ్.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) కొత్త షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (జులై 8) విడుదల చేసింది. ఈ మేరకు గతంలో వెలువరించిన షెడ్యూల్‌ను మార్చి కొత్త తేదీలను ప్రకటించింది. అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు టెట్‌ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు సన్నాహమయ్యేందుకు ప్రతీ పరీక్షకు 90 రోజుల వ్యవధి ఉండేలా కొత్త షెడ్యూల్‌ను రూపొందిచారు. ఈ నెల 2వ తేదీన విడుదలైన టెట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం..

AP TET 2024: ఏపీ టెట్‌ పరీక్ష తేదీలు మారాయోచ్.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
AP TET 2024 Revised exam Schedule
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 09, 2024 | 6:42 AM

అమరావతి, జులై 9: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) కొత్త షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (జులై 8) విడుదల చేసింది. ఈ మేరకు గతంలో వెలువరించిన షెడ్యూల్‌ను మార్చి కొత్త తేదీలను ప్రకటించింది. అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు టెట్‌ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు సన్నాహమయ్యేందుకు ప్రతీ పరీక్షకు 90 రోజుల వ్యవధి ఉండేలా కొత్త షెడ్యూల్‌ను రూపొందిచారు. ఈ నెల 2వ తేదీన విడుదలైన టెట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం జులై 4 నుంచి జులై 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. ఇక ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే తాజా షెడ్యూల్‌లో ఈ తేదీలన్నీ మారాయి. దరఖాస్తు గడువును ఆగస్టు ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. ఇక టెట్‌ పరీక్షలు ఏకంగా అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించాలని 3 నెలల వ్యవధిని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి వెలువడిన మెగా డీఎస్సీకి ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ టెట్ 2024 కొత్త షెడ్యూల్‌ ఇదే..

  • టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల: జులై 2, 2024.
  • పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా.. ఆగస్టు 3 వరకు అవకాశం ఉంటుంది.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు3, 2024.
  • ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌లు: సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ తేదీ: జులై 22 నుంచి
  • టెట్‌ పరీక్ష తేదీలు: అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు
  • ప్రొవిజినల్‌ కీ విడుదల తేదీ: అక్టోబర్‌ 4, 2024.
  • ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ తేదీ: అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం..
  • ఫైనల్‌ ఆన్సర్ కీ విడుదల తేదీ: అక్టోబర్‌ 27, 2024.
  • టెట్‌ ఫలితాలు విడుదల: నవంబర్‌ 2, 2024.

ఏపీ టెట్-2024 అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముగింపు తేదీ ముగిసేలోపు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ అధికారిక వెబ్‌సైట్‌ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.750 చొప్పున ఫీజు చెల్లించాలి. పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి వేర్వేరుగా ఎన్ని సబ్జెక్టులు రాయదల్చితే అన్ని సార్లు రూ.750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.