TG DSC 2024: ‘డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు.. యథాతథంగా నిర్వహిస్తాం’ విద్యాశాఖ స్పష్టం
తెలంగాణలో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇటీవల సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను వెల్లడించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఇవే తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని..
హైదరాబాద్, జులై 9: తెలంగాణలో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇటీవల సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను వెల్లడించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఇవే తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. అయితే ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలయ్యాయని.. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో వారంతా సోమవారం ఉదయం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడించి, నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులకు 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జులై 17 నుంచి మొత్తం 13 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి.
టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్స్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గతేడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు కమిషన్ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసింది. అయితే త్వరలోనే పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో మరో జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపింది. కాగా మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఈ నియామక ప్రక్రియను చేపట్టింది.
టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.