AP SSC Supply 2024 Results: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (జూన్‌ 26) విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. మే 24 నుంచి జూన్‌ 3 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఈ రోజు విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు..

AP SSC Supply 2024 Results: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
AP SSC Supply 2024 Results
Follow us

|

Updated on: Jun 26, 2024 | 9:21 PM

అమరావతి, జూన్‌ 26: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (జూన్‌ 26) విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. మే 24 నుంచి జూన్‌ 3 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఈ రోజు విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 1,61,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 10 వరకు నిర్వహించారు. అనంతరం జూన్ 6 నుంచి 9 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. తాజాగా ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు ప్రకటించింది. ఇందులో బాలుర ఉత్తీర్ణత 59.99 శాతం, బాలికల ఉత్తీర్ణత 65.96 శాతంగా నమోదైంది. మొత్తం 67,115 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు విడుదలైన నాలుగు రోజుల తర్వాత మార్కుల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం, మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 27వ తేదీ నుంచి జులై 1వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. అలాగే రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజుగా చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.