AP PGCET 2025 Exam Schedule: ఏపీ పీజీసెట్ 2025 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసిందోచ్.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్షల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమై మే 5వ తేదీతో ముగిసింది. అయితే నోటిఫికేషన్‌లో ప్రవేశ పరీక్షల తేదీలను మాత్రం పేర్కొనలేదు. దీంతో తాజా ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్యాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2025 పరీక్షలు జూన్ 9 నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో రోజుకు రెండు విడతల్లో ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు ఇవే..
- ఆంధ్ర యూనివర్సిటీ (విశాఖపట్నం)
- డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ (శ్రీకాకుళం)
- శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి)
- డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ (కర్నూలు)
- శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ(అనంతపురం)
- ద్రవిడియన్ యూనివర్సిటీ (కుప్పం)
- ఆచార్య నాగార్జన యూనివర్సిటీ (గుంటూరు)
- కృష్ణా యూనివర్సిటీ (మచిలీపట్నం)
- శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి)
- ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (రాజమహేంద్రవరం)
- యోగి వేమన యూనివర్సిటీ (కడప)
- క్లస్టర్ యూనివర్సిటీ (కర్నూలు)
- రాయలసీమ యూనివర్సిటీ (కర్నూలు)
- ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ (ఒంగోలు)
- విక్రమ సింహపురి యూనివర్సిటీ (నెల్లూరు)
- జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపూర్- ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
- శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి)
ఏపీ పీజీసెట్-2025 ఎగ్జామినేషన్ షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 150కి పైగా పీజీ కోర్సుల్లో ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




