AP DEECET 2024 Exam Date: రేపే ఏపీ డీఈఈసెట్‌ 2024 రాత పరీక్ష.. అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ డీఈఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను మే 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఏపీ డీఈఈసెట్‌ 2024 పరీక్ష.

AP DEECET 2024 Exam Date: రేపే ఏపీ డీఈఈసెట్‌ 2024 రాత పరీక్ష.. అన్ని ఏర్పాట్లు పూర్తి
AP DEECET 2024
Follow us

|

Updated on: May 24, 2024 | 6:23 AM

అమరావతి, మే 15: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ డీఈఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను మే 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఏపీ డీఈఈసెట్‌ 2024 పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 4,949 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

ఎన్‌.జి.రంగా వ్యవసాయ వర్సిటీలో వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో జులైలో అగ్రికల్చర్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనుంది. ఇందుకు సంబంధించి ఆసక్తి కలిగిన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ కె. గురవారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మిద్దె తోటలు, పట్టు పురుగుల పెంపకం, జీవ ఎరువుల తయారీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు జూన్‌ 20 లోపు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలని తెలిపారు.

శాతవాహన యూనివర్సిటీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పరీక్ష ఫలితాలు విడుదల

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో 2024 ఏప్రిల్‌లో నిర్వహించిన 2, 4, 6 సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా శ్రీరంగప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles