AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter: ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగే చెయ్యాలా ఏంటి? ఈ సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా ఉన్నాయి.

టెన్త్‌ తర్వాత ఇంటర్‌ అది పూర్తికాగానే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్‌ మనలో చాలా మంది ఇదే ఆలోచనలో ఉంటారు. అటు విద్యార్థులు మొదలు, ఇటు తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇలానే ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌ అవసరాల నేపథ్యంలో సర్టిఫికెట్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఇంటర్‌ తర్వాత పలు సర్టిఫికెట్‌ కోర్సులు చేస్తే తక్కువ సమయంలో ఉద్యోగాలు పొందే అవకాశం కూడా పొందొచ్చు...

Inter: ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగే చెయ్యాలా ఏంటి? ఈ సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా ఉన్నాయి.
Certificate Courses
Narender Vaitla
|

Updated on: May 23, 2024 | 8:30 AM

Share

టెన్త్‌ తర్వాత ఇంటర్‌ అది పూర్తికాగానే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్‌ మనలో చాలా మంది ఇదే ఆలోచనలో ఉంటారు. అటు విద్యార్థులు మొదలు, ఇటు తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇలానే ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌ అవసరాల నేపథ్యంలో సర్టిఫికెట్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఇంటర్‌ తర్వాత పలు సర్టిఫికెట్‌ కోర్సులు చేస్తే తక్కువ సమయంలో ఉద్యోగాలు పొందే అవకాశం కూడా పొందొచ్చు. ఇంతకీ ఇంటర్‌ తర్వాత అందుబాటులో ఉన్న కొన్ని సర్టిఫికెట్ కోర్సులు ఏంటి.? ఇవి పూర్తి చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి..? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రస్తుతం సైబర్‌ సెక్యూరిటీకి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సైబర్‌ దాడులు పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో చాలా సంస్థలు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో సెక్యూరిటీ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తోంది. సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ ఫోరెన్సిక్స్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ వంటి వాటి స్కిల్స్‌ నేర్చుకున్న వారికి ఉద్యోగవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. పలు సంస్థలు ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో సర్టిఫికేట్‌ కోర్సులను అందిస్తోంది.

* కంప్యూటర్ల వినియోగం భారీగా పెరుగుతోన్న ఈ రోజుల్లో హార్డ్‌వేర్‌ విభాగాల్లో ఉపాధి అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో హార్డ్‌వేర్‌ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఇందుకోసం ఇంటర్‌ అర్హతతో పలు సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. ముఖ్యంగా సీపీయూ మెయింటనెన్స్, నెట్‌ వర్కింగ్, లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ నిర్వహణ వంటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ అండ్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ రిపెయిర్‌ అండ్‌ మెయింటనెన్స్‌ ఆఫ్‌ సిస్టమ్స్‌ వంటి కోర్సులు ఉన్నాయి. ఇవి పూర్తి చేస్తే.. హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్‌ అసిస్టెంట్స్, సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వంటి ఉద్యోగాలు పొందొచ్చు.

* వీడియో ఎడిటింగ్‌ నిపుణులకు కూడా ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటోంది. ఒకప్పుడు వీడియో ఎడిటింగ్ అంటే కేవలం సినిమాలకు, ఫొటోషాప్‌లలో మాత్రమే ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం పొలిటికల్ లీడర్స్‌ ప్రమోషన్స్‌లో వీడియో ఎడిటర్స్‌ అవసరపడుతున్నారు. వీడియో ఎడిటింగ్‌కు సంబంధించి పలు సంస్థలు మూడు నెలల నుంచి ఏడాది వ్యవధిలో కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ఆన్‌లైన్‌ కోర్సులు కూడా ఉన్నాయి. ఈ సర్టిఫికేషన్‌ పొందిన వారికి ఫ్రీలాన్సింగ్ విధానంలో కూడా పనిచేసుకునే వెసులుబాటు ఉంది.

* ఇక ఇంటర్‌ చేసిన వారికి కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా హోటల్‌ మేనేజ్‌మెంట్ కూడా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ప్రస్తుతం భారత్‌లో కూడా హోటల్‌ మేనేజ్‌మెంట్ చేసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం వంటి కోర్సుల్లో చేరొచ్చు. విదేశాల్లో ఈ కోర్సులు చేస్తే మరిన్ని అవకాశాలు పొందొచ్చు.

* బ్యూటీషియన్స్‌కు ఇటీవల భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. బ్యుటీషియన్‌ విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన వారికి సినిమా రంగాల్లో, మీడియా సంస్థల్లో ఉద్యోగవకాశాలు లభిస్తున్నాయి. లేదంటే సొంతంగా కూడా బ్యూటీ పార్లర్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వివాహాలు, పుట్టిన రోజు వేడుకల వంటి వాటివి డోర్‌ స్టెప్‌ సేవలు కూడా అందించొచ్చు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. 2050 నాటికి తులం రూ.40 లక్షలు..?
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. 2050 నాటికి తులం రూ.40 లక్షలు..?
ఖర్చు లేకుండా క్యాన్సర్‌కు చెక్.. మీ వంటింట్లోనే దివ్యౌషధం..
ఖర్చు లేకుండా క్యాన్సర్‌కు చెక్.. మీ వంటింట్లోనే దివ్యౌషధం..
మంచు కొండల్లో పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం! వెడ్డింగ్‌ సీన్ వైరల్
మంచు కొండల్లో పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం! వెడ్డింగ్‌ సీన్ వైరల్
మీ ఇంటి బాత్రూమ్ టైల్స్ మురికిగా ఉన్నాయా.. వీటితో మాయం చేయండి
మీ ఇంటి బాత్రూమ్ టైల్స్ మురికిగా ఉన్నాయా.. వీటితో మాయం చేయండి
Lucky Zodiac Signs: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!
Lucky Zodiac Signs: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!
పనిమనిషిపై అఘాయిత్యం.. ధురంధర్ నటుడు అరెస్ట్
పనిమనిషిపై అఘాయిత్యం.. ధురంధర్ నటుడు అరెస్ట్
పోలీస్ జాబ్ అంటే ప్రాణం.. గంజాయ్ ముఠాను పట్టుకునేందుకు వెళితే..
పోలీస్ జాబ్ అంటే ప్రాణం.. గంజాయ్ ముఠాను పట్టుకునేందుకు వెళితే..
బాక్సాఫీస్ కింగ్.. రూ.4 లక్షల జీతం..ఇప్పుడు..
బాక్సాఫీస్ కింగ్.. రూ.4 లక్షల జీతం..ఇప్పుడు..
వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్..
వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్..
ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు
ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు