AP POLYCET 2024: ఏపీ పాలిసెట్ షెడ్యూల్ విడుదల.. అప్పటి నుంచే కౌన్సిలింగ్ ప్రారంభం..
ఏపీ పాలిసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ AP పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన వివరాలు అధికారిక వెబ్ సైట్ appolycet.nic.in లో చూసుకోవచ్చు. ర్యాంక్ హోల్డర్లందరికీ AP పాలిసెట్ ఫీజు చెల్లింపు సదుపాయం మే 24న ప్రారంభమవుతుందని తెలిపింది. మే 27 నుండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఏపీ పాలిసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ AP పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన వివరాలు అధికారిక వెబ్ సైట్ appolycet.nic.in లో చూసుకోవచ్చు. ర్యాంక్ హోల్డర్లందరికీ AP పాలిసెట్ ఫీజు చెల్లింపు సదుపాయం మే 24న ప్రారంభమవుతుందని తెలిపింది. మే 27 నుండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు పూర్తి షెడ్యూల్‌ను పైన పేర్కొన్న అధికారిక సైట్లో వెళ్లి చెక్ చేసుకోవచ్చు. AP POLYCETకు అర్హత పొందిన అభ్యర్థులు మే 31 నుండి కౌన్సెలింగ్ కోసం కళాశాలల ఎంపికలను భర్తీచేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన దరఖాస్తు ఫారం కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే appolycet.nic.in.లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. AP POLYCET ర్యాంక్ హోల్డర్లు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మే 24 నుంచి జూన్ 2 మధ్య ప్రాసెసింగ్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది.
షెడ్యూల్ చివరి రోజు అభ్యర్థి చివరిగా ఏ కళాశాలల ఎంపిక చేసుకుంటారో వాటిని స్థిరంగా ఉంచబడతాయని తెలిపింది. అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఆప్షన్లను పేపర్లో ప్రింట్ తీసుకుని కౌన్సిలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. షెడ్యూల్ వెలువడిన రోజు నుంచి ఎన్ని ఆప్షన్లు ఎంపిక చేసుకున్నా.. చివరి రోజున సర్వర్‌లో నమోదు అయిన కళాశాలలను మాత్రమే సీట్ల కేటాయింపు కోసం పరిగణించబడతాయని స్పష్టం చేసింది.
పాలిసెట్ కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాలు..
- AP POLYCET హాల్ టికెట్
- AP POLYCET ర్యాంక్ కార్డ్
- 10వ తరగతి మార్క్ లిస్ట్ లేదా ఆన్లైన్ మార్కుల మెమో
- 4 నుండి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్ / అర్హత పరీక్షకు ముందు 7 సంవత్సరాలకు విద్యార్థి రెసిడెన్సియల్ సర్టిఫికేట్ / 10 సంవత్సరాల కాలానికి తండ్రి లేదా తల్లి ఆంధ్రప్రదేశ్ నివాస ధృవీకరణ పత్రం.
- EWS కేటగిరీ కింద రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేయాలనుకునే OC అభ్యర్థులకు మీసేవ/ (గ్రామ్/వార్డ్) సచివాలయం నుండి 2024-25 సంవత్సరానికి ధృవీకరించిన చెల్లుబాటు అయ్యే EWS సర్టిఫికేట్.
ర్యాంకుల వారీ డాక్యూమెంట్ వెరిఫికేషన్..
- 01 నుండి 12,000 – మే 27
- 12,001 నుండి 27,000 – మే 28
- 27,001 నుండి 43,000 – మే 29
- 43,001 నుండి 59,000 – మే 30
- 59,001 నుండి 75,000 – మే 31
- 75,001 నుండి 92,000 – జూన్ 1
- 92,001 నుండి 1,08,000 – జూన్ 2
- 1,08,001 నుంచి చివరి వరకు – జూన్ 3
ఆప్షన్స్ ఫిల్లింగ్ షెడ్యూల్..
- 1 నుండి 50,000 ర్యాంక్ వరకు అభ్యర్థులు మే 31 నుండి జూన్ 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
- 50,001 నుండి 90,000 ర్యాంక్ వరకు అభ్యర్థులు జూన్ 2 నుండి జూన్ 3 వరకు కళాశాలలు ఎంపిక చేసుకోవాలి
- 90,001 నుండి చివరి ర్యాంక్ వరకు విద్యార్థులు జూన్ 4 నుండి జూన్ 5 వరకు ఆప్షన్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
- అన్ని ర్యాంకుల వారు ఆప్షన్లను మార్పు కోసం గడువు జూన్ 5 వరకు ఉంటుంది.
- సీటు కేటాయింపులు ప్రక్రియ జూన్ 7
మరిన్ని విద్య, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




