TV9–KAB Education Summit 2024: ఉన్నత విద్య, భవిష్యత్తుపై సందేహాలున్నాయా..? ఏపీలో మెగా ఎడ్యుకేషన్ సమ్మిట్.. పూర్తి వివరాలివే..
మీ పిల్లల ఉన్నత భవిష్యత్తు.. విద్య, అవకాశాలపై సందేహాలున్నాయా..? అయితే.. ఎంట్రీ ఫ్రీ.. సూచనలు కూడా ఫ్రీ.. టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో అన్ని వివరాలను సులభంగా పొందొచ్చు.. TV9, KAB Education Consultants సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై నిపుణులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు..
మీ పిల్లల ఉన్నత భవిష్యత్తు.. విద్య, అవకాశాలపై సందేహాలున్నాయా..? అయితే.. ఎంట్రీ ఫ్రీ.. సూచనలు కూడా ఫ్రీ.. టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో అన్ని వివరాలను సులభంగా పొందొచ్చు.. TV9, KAB Education Consultants సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై నిపుణులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.. హైదరాబాద్‌లో వీ9 అండ్ క్యాబ్ సంయుక్తంగా నిర్వహించిన టీవీ9 ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు భారీ స్పందన వచ్చింది. హైదరాబాద్ హైటెక్స్‌లో 31 మే, జూన్ 1, 2 వ తేదీలలో జరిగింది. క్యాబ్, టీవీ9 ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు వేలాదిమంది విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చారు. హైదరబాద్ లో భారీ స్పందన రాగా.. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగనుంది. TV9, KAB Education Consultancy సంయుక్తంగా నిర్వహించే.. అతిపెద్ద ఎడ్యుకేషనల్ సమ్మిట్ జూన్ 8, 9వ తేదీలలో విజయవాడలో, జూన్ 9న విశాఖపట్నంలో జరగనుంది..
వాస్తవానికి ప్రతీ సంవత్సరం TV9 నిర్వహిస్తోన్న ఎడుకేషన్ సమ్మిట్ ద్వారా ఎంతో మంది ఇంటర్(+2), డిప్లొమా విద్యార్థులు తదుపరి విద్యావకాశాల గురించి, కాలేజీల గురించి, ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెసుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు EAPCET, NEET, JOSAA, E-CET వెబ్ కౌన్సిలింగ్‌లలో అప్షన్స్ నమోదు చేసుకోవడానికి ఎక్స్‌పర్ట్ సలహాలు, సూచనలు పొందుతున్నారు. ప్రతిష్టాత్మక కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, డీమ్డ్ యూనివర్సిటీల ప్రతినిధులతో కలిసి నేరుగా మాట్లాడే అవకాశం కల్పించే ఈ TV9 Education Summit 2024 విజయవాడ, విశాఖపట్నంలో జరగనుంది.
ఎన్నో ప్రఖ్యాత కాలేజీలు యూనివర్సిటీలు పాల్గొనే ఈ Education Summitలో, విద్యార్థులు +2, Diploma తరువాత తదుపరి విద్యావకాశాలు, పలురకాల కోర్సులు, వాటికి సంబందించిన కాలేజీలు, యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవచ్చు.
ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ, హోటల్ మేనేజ్‌మెంట్, బిజినెస్ మేనేజ్‌మెంట్, CA లాంటి ఎన్నో కోర్సులు కాలేజీల గురించి గైడెన్స్ ఇస్తూ ఎన్నో ప్రఖ్యాత విద్యాసంస్థల గురించి తెలియజేసే ఈ Education Summit విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుంది.. భవిష్యత్తుపై సందేహాల నివృత్తి, ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్నిఅందించడంతోపాటు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు EAPCET, NEET, JOSAA, E-CET వెబ్ కౌన్సిలింగ్ లలో అప్షన్స్ నమోదు చేసుకోవడానికి ఎక్స్ పర్ట్ సలహాలు, సూచనలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందించనుంది..
ఆంధ్రప్రదేశ్‌లో TV9, KAB Education Summit 2024 నిర్వహణ వివరాలు..
- Vijayawada: June 8th & 9th’ 2024 – SS Convention Centres, Lane Opp: PVP Mall, MG Road.
- Visakhapatnam: June 9th’ 2024 – VMRDA Children’s Arena, Siripuram.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.