AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malla Reddy: కావాల్సినంత ల్యాండ్‌ ఉంది.. కబ్జా చేయాల్సిన అవసరం లేదు.. సుచిత్ర భూ వివాదంపై మల్లారెడ్డి

హైదరాబాద్‌ సుచిత్ర సర్కిల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ, ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ అండ్‌ టీమ్‌ మధ్య భూవివాదం నెలకొంది. దానికి సంబంధించిన వ్యవహారం నాలుగు రోజుల క్రితం పరస్పర దాడుల వరకు వెళ్లింది. ఇరుపక్షాల ఫిర్యాదు మేరకు రెండు వర్గాలపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. ఈ వివాదం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.

Malla Reddy: కావాల్సినంత ల్యాండ్‌ ఉంది.. కబ్జా చేయాల్సిన అవసరం లేదు.. సుచిత్ర భూ వివాదంపై మల్లారెడ్డి
Malla Reddy
Shaik Madar Saheb
|

Updated on: May 22, 2024 | 8:39 PM

Share

హైదరాబాద్‌ సుచిత్ర సర్కిల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ, ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ అండ్‌ టీమ్‌ మధ్య భూవివాదం నెలకొంది. దానికి సంబంధించిన వ్యవహారం నాలుగు రోజుల క్రితం పరస్పర దాడుల వరకు వెళ్లింది. ఇరుపక్షాల ఫిర్యాదు మేరకు రెండు వర్గాలపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. ఈ వివాదం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. సుచిత్ర భూమి విషయంలో మల్లారెడ్డి, ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తమ డాక్యుమెంట్సే కరెక్ట్‌ అని మల్లారెడ్డి.. కాదు.. తమ డాక్యుమెంట్సే కరెక్ట్‌ అని లక్ష్మణ్‌.. ఆ భూమి కోసం పోరాటం చేస్తున్నారు. అయితే.. వివాదం తారాస్థాయికి చేరడంతో వివాదాస్పద భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే రిపోర్ట్ రెడీ చేశారు.

ఇక.. సుచిత్ర భూవివాదంపై టీవీ9 వేదికగా మరోసారి రియాక్ట్‌ అయ్యారు మల్లారెడ్డి. తన అల్లుడు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఆ భూమికి సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఆ భూమిని 14 ఏళ్ల క్రితమే తాము కొనుగోలు చేశామని.. కానీ.. కొందరు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా.. ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌కు మళ్లీ సవాల్‌ విసిరారు. ఆయన ఆరోపణలపై విచారణ జరపాలని.. ఒకవేళ తమది తప్పని తేలితే భూమిని వారికి ఇచ్చేందుకు సిద్ధమన్నారు మల్లారెడ్డి.

భూములు కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు మల్లారెడ్డి. తమకు కావాల్సినంత ల్యాండ్‌ బ్యాంక్ ఉందని.. భూములు ఎక్కువ ఉన్నందువల్లే కొందరు వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. భూ వివాదానికి సంబంధించి సీఎం రేవంత్‌ అపాయింట్‌మెంట్ అడిగామని.. అపాయింట్‌మెంట్ దొరికితే అన్ని పత్రాలు ఇచ్చి వివరిస్తామన్నారు మల్లారెడ్డి.

సుచిత్ర భూమి విషయంలో కావాలనే కొందరు తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి. సుచిత్ర దగ్గర భూములు కొన్నామని చెప్తున్న ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌.. ఒక్క రూపాయి అయినా చెల్లించినట్టు చూపించగలరా అని ప్రశ్నించారు. ఒకవేళ డబ్బులు చెల్లించినట్లు ఆధారాలు చూపిస్తే భూమి విషయంలో ఎలాంటి చర్యలకైనా రెడీ అన్నారు మర్రి రాజశేఖర్‌రెడ్డి.

మొత్తంగా.. హైదరాబాద్‌ సుచిత్ర భూవివాదంపై కాన్ఫిడెన్స్‌ కామెంట్స్‌, చాలెంజ్‌లు చేస్తున్నారు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి. అయితే.. మల్లారెడ్డి ఫ్యామిలీ సవాళ్లపై ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌