AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. తీర్పుపై ఉత్కంఠ..

ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఏపీ హై కోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‎ను విచారణకు ఏపీ హై కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీలో మాచర్ల నియోజకవర్గం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణా రెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఈసీ సీరియస్ అయింది. ఆయనపై పలు సెక్షన్ల కింద పలు కేసులు నమోదు అయ్యాయి.

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. తీర్పుపై ఉత్కంఠ..
Pinnelli Rama Krishna Reddy
Srikar T
|

Updated on: May 23, 2024 | 4:47 PM

Share

ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఏపీ హై కోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‎ను విచారణకు ఏపీ హై కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీలో మాచర్ల నియోజకవర్గం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణా రెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఈసీ సీరియస్ అయింది. ఆయనపై పలు సెక్షన్ల కింద పలు కేసులు నమోదు అయ్యాయి. దీంతో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడం కోసం పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో A1 గా నమోదు చేసిన పోలీసులు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. అయినా పిన్నెల్లి ఆచూకీ దొరకలేదు.

మే 22న బుధవారం హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు వెళ్లారు. కానీ పిన్నెల్లి ఆచూకీ దొరకలేదు. ఆయన కారును సీజ్‌ చేసిన పోలీసులు.. డ్రైవర్‌‎ను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి.. తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయడం చర్చనీయాంశమైంది. మరికాసేపట్లో ఏపీ హై కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. తాను ఈవీఎం ధ్వంసం చేయడానికి సంబంధించిన ఆధారాలు, కారణాలను కోర్టుకు వివరించనున్నారు పిన్నెల్లి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే అనేక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ పిటిషన్‎పై ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోఅన్న ఉత్కంఠ అటు పార్టీ వర్గాల్లో, ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..