Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Jackpot: పాకిస్థాన్ లో భారీ బంగారు నిల్వలు.. విలువ ఎంతంటే?

ఓటమి ఖాయమనుకుంటున్న క్రికెట్ మ్యాచ్ లో ఆఖరి బాల్ సిక్స్ కొట్టి గెలిస్తే ఎలా ఉంటుందో, అదే మజాను మన పొరుగుదేశం పాకిస్థాన్ పొందుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా పతనం అయ్యిందో ప్రపంచానికి తెలుసు. రాజకీయ అస్థిరత, టెర్రరిజం, అంతర్గత కలహాలతో పాకిస్థాన్ దుర్భర స్థితిలో ఉంది. ప్రపంచ దేశాలు అందించే ఆర్థిక సాయంతోనే మనుగడ సాగిస్తోంది. ఇలాంటి కష్టకాలంలో 32.6 మెట్రిక్ టన్నుల భారీ బంగారు నిల్వలను ఆ దేశంలో గుర్తించారు. దాని విలువ దాదాపు రూ.600 మిలియన్లు ఉంటుందని అంచనా. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంది.

Pakistan Jackpot: పాకిస్థాన్ లో భారీ బంగారు నిల్వలు.. విలువ ఎంతంటే?
Gold price
Follow us
Srinu

|

Updated on: Jan 13, 2025 | 10:16 AM

పాకిస్ఘాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో గల అటాక్ జిల్లాలో ప్రవహిస్తున్న సింధు నదిలో బంగారు నిల్వలను గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (జీఎస్పీ) ఈ నిల్వలను కనుగొంది. 32.6 మెట్రిక్ టన్నుల విలువైన బంగారు నిక్షేపాల విలువ 600 బిలియన్ పాకిస్థాన్ రూపాయలు ఉంటుందని అంచనా. ఈ విషయాన్ని పంజాబ్ మైనింగ్ మంత్రి ఇబ్రహీం హాసన్ మురాద్ ధ్రువీకరించారు. మన పొరుగున మరో దేశం చైనా కూడా ఇటీవలే బంగారు నిల్వలను కనుగొంది. ఈశాన్య ప్రాంతంలోని పింగ్జియాంగ్ కౌంటీలో 1000 టన్నుల అధిక నాణ్యత కలిగిన ఖనిజాన్ని ఆ దేశ పరిశోధకులు గుర్తించారు. దాని విలువ సుమారు 600 బిలియన్ యువాన్లు (రూ.6,914,73 కోట్లు)గా నిర్ధారణ చేశారు. ఇప్పటి వరకూ బయటపడిన అతి పెద్ద బంగారం నిల్వలలో ఇదే అత్యధికమని చెప్పవచ్చు.

చైనా దేశంలో దొరికిన బంగారు నిధితో ఆ దేశం పాలకులు సంతోషం వ్యక్తం చేశారు. వారి కన్నా పాకిస్థాన్ పాలకులు సంబరాలు చేసుకుంటున్నారు. తీవ్రమైన ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ కు ఈ నిధి చాలా అత్యవసరం. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఊపిరి అందుతుంది. అయితే ఆ నిల్వలను సక్రమంగా వినియోగించుకోవడమే అత్యంత అవసరం. తీవ్ర ఇబ్బందులతో కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడడంతో పాటు దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అటాక్ ప్రాంతంలోని సింధు నది ప్రాంతంలో దాదాపు 32 కిలోమీటర్ల మేర గణనీయమైన నిక్షేపాలు ఉన్నాయి. పెషావర్ బేసిన్, మర్దాన్, పంజాబ్, ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్ లలో అదనపు నిక్షేపాలను కనుగొన్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతుంది. వాటిని నియంత్రించగలిగితే ఆ దేశానికి, ప్రజలకు మంచి జరుగుతుంది. లేకపోతే సంఘ విద్రోహులు, టెర్రరిస్టుల చేతుల్లోకి పోయే ప్రమాదం కూడా ఉంది.

సింధు నదిలో దొరుకుతున్న బంగారం

హిమలయ పర్వతాల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. అక్కడ టెక్టోనిక్ కార్యకలాపాల కారణంగా మిలియన్ల ఏళ్ల క్రితం నదిలో ఖనిజాలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ మీదుగా ఆ నది ప్రవహించినప్పుడు బంగారు కణాలు దానిలో వెళ్లిపోతాయి. అనంతరం ఒడ్డున ప్లేసర్ డిపాజిట్లుగా ఏర్పడతాయి. అంటే బంగారు నిల్వలుగా రూపాంతరం చెందుతాయి. నీటి మట్టాలు తక్కువగా ఉండే శీతాకాలంలో అవి బయటపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి