TATA EV Bike: త్వరలోనే టాటా ఈవీ బైక్ లాంచ్.. అసలు నిజం ఏంటంటే?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకం వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రముఖ కంపెనీలు దూసుకుపోతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో గుర్తింపు పొందిన తర్వాత టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీకి సిద్ధమవుతున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా ఈవీ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని దేశీయ కంపెనీ అయిన టాటా మోటర్స్ ఈవీ బైక్స్ లాంచ్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా టాటా ఈవీ బైక్ పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్యను తీర్చడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ ప్రణాళికలను అధికారికంగా ప్రకటించనప్పటికీ, మార్కెట్ ఊహాగానాలతో పాటు సోషల్ మీడియా చర్చలు బట్టి చూస్తే త్వరలోనే టాటా మోటర్స్ ఈవీ బైక్‌ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టాటాకు సంబంధించిన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్ల గురించి పుకార్లు విస్తృతంగా షికార్లు చేస్తున్నాయి.
పుకార్ల ప్రకారం టాటా ఈవీ బైక్ గరిష్టంగా గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా రూపొందిస్తున్నారు. అలాగే ఈ ఈవీ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 నుంచి 200 కిలో మీటర్ల మైలేజ్ ఇచ్చేలా లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. టాటా బైక్ టాటా మోటార్స్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వివిధ పరిస్థితుల కోసం రూపొందించిన మల్టీ-రైడింగ్ మోడ్‌లతో సహా అధునాతన సాంకేతికతతో తన ఎలక్ట్రిక్ బైక్‌ను సన్నద్ధం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ బైక్ బ్యాటరీ సాంకేతికతను ఉపయోగించి టాటా అద్భుతమైన యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఈవీ బైక్ లాంచ్‌తో పాటు అవసరమైన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడంపై టాటా దృష్టి సారించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. టాటా పవర్ ఆర్మ్ ద్వారా, కంపెనీ ఇప్పటికే భారతదేశం అంతటా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను విస్తరించే పనిలో ఉంది. ఈ ప్రయత్నం టాటాకు సంబంధించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పరిచయాన్ని మరింత వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి