Retirement Plan: పదవీ విరమణకు ఇదే పక్కా ప్రణాళిక.. పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి
పదవీ విరమణ తర్వాత జీవితం సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఉద్యోగంలో ఉండగానే ప్రణాళిక రూపొందించుకోవడం చాాలా అవసరం. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగితే అదేమీ అసాధ్యం కాదు. ఉద్యోగం చేస్తున్నంత కాలం ప్రతి నెలా ఆదాయం వస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితం సాగుతుంది. కానీ విరమణ తర్వాత జీతం రాదు కాబట్టి ముందుగానే ప్రణాళికాబద్దంగా ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది కలగదు. 50 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయాలనుకున్న 40 ఏళ్ల వయసులో ఎంత ఆదాయం సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు 50 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయాలనుకుంటున్నప్పుడు సమగ్రమైన ప్రణాళిక, గణనీయమైన పొదుపులు, అవగాహనతో కూడిన పెట్టుబడులు పెట్టాలి. అది కూడా 40 ఏళ్ల వయసుకే వాటిని ప్రారంభించాలి. దీని కోసం ఆదాయ స్థాయిలు, పొదుపు రేట్లు, పెట్టుబడి, రాబడి అనే అంశాలు చాలా కీలకంగా ఉంటాయి. అలాగే ఈ కింది తెలిపిన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. పదవీ విరమణ తర్వాత మీకు ఖర్చులకు ఎంత డబ్బు అవసరమవుతుందో అంచనా వేసుకోవాలి. హౌసింగ్, ఆరోగ్యం, ప్రయాణం, రోజువారీ ఖర్చులను లెక్కించుకోవాలి. సుమారుగా మీకు వచ్చే జీతంలో దాదాపు 70 నుంచి 80 శాతం వచ్చేలా చూసుకోవాలి.
రిటైర్మెంట్ తర్వాత, పెరిగిన వయసు రీత్యా అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వాటి చికిత్సల కోసం హాస్పిటల్ బిల్లులు బాగా ఎక్కువగా ఉంటాయి. పింఛన్లు, ఇతర రూపాల్లో వచ్చిన ఆదాయం దానికే ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. మీ రిటైర్మెంట్ సమయానికి మీరు పొదుపు ఎంత ఉండాలన్నది చాలా కీలకం. దీని కోసం 25 టైమ్ రూల్ ను పాటించాలి. ఉదాహరణకు మీ వార్షిక ఖర్చులు రూ.18 లక్షలు అనుకుంటే, దానికి 25 రేట్లు అంటే రూ.4.5 కోట్లు ఆదా చేసుకోవాలి. అధిక రాబడి అందించే మార్గాలలో పెట్టుబడి పెట్టడం చాలా కీలకం. దానిలో భాగంగా స్టాక్ లు, బాండ్లు, ఇతర ఆస్తులు, విభిన్న పద్దతుల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీలు ఎక్కువ రాబడిని, బాండ్లు స్థిరమైన రాబడిని అందిస్తాయి.
కొన్ని రకమైన పెట్టుబడి మార్గాల వల్ల ఆదాయపు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వంటి పదవీ విరమణ ఖాతాలను ఉపయోగించుకోవాలి. అద్దె ప్రాపర్టీలు, డివిడెంట్ చెల్లించే స్టాక్ లో పెట్టుబడి పెట్టాలి, లేదా కనీస రోజువారీ ఆదాయం సంపాదించుకునేందుకు సైడ్ బిజినెస్ ప్రారంభించాలి. పదవీ విరమణ అనంతరం కొందరు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తారు. దీని వల్ల కొంత ఆదాయం పొందే అవకాశం కలుగుతుంది. తద్వారా వారి పొదుపు నుంచి తీసుకునే మొత్తం తగ్గుతుంది. జీవన వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా పొదుపును చేసే అవకాశం కలుగుతుంది. తక్కువ వ్యయం, ఇంటి ఖర్చులు, పన్నులు ఉన్న ప్రాంతానికి మారడం ద్వారా మేలు జరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి