AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Offers: మారుతి సుజుకీ బంపర్ ఆఫర్.. ఆ కారుపై ఏకంగా రూ. 49,000 డిస్కౌంట్.. త్వరపడండి..

మన దేశంలో మారుతి సుజుకి నుంచి అక్టోబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన కారు ఈ మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్. వాస్తవానికి గత కొన్ని నెలలుగా దీని కొనుగోళ్ల వృద్ధి రేటు పెరుగూతూ వస్తోంది. అక్టోబర్ 2023లో, మారుతి సుజుకి 22,080 యూనిట్లను విక్రయించింది. అదే అక్టోబర్ 2022లో 17,945 యూనిట్లను విక్రయించింది. అంటే ఈ ఏడాది 23% వృద్ధిని నమోదు చేసింది.

Car Offers: మారుతి సుజుకీ బంపర్ ఆఫర్.. ఆ కారుపై ఏకంగా రూ. 49,000 డిస్కౌంట్.. త్వరపడండి..
Maruti Suzuki Wagon R
Madhu
| Edited By: |

Updated on: Nov 12, 2023 | 9:35 PM

Share

మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్లో, చిన్న కుటుంబానికి తగిన విధంగా ఉండే కారు కావాలనుకుంటున్నారా? అయితే మీకిదే బెస్ట్ ఆప్షన్. వాస్తవానికి మారుతి సుజుకీ కార్లు తక్కువ ధరకే లభిస్తాయి. అనువైన బడ్జెట్లో బెస్ట్ ఎంపికగా ఉంటాయి. వాటిల్లో మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకు కారణంగా దాని పరిమాణం, అందులోని ఫీచర్లు. అందుకే మన దేశంలో బెస్ట్ సెల్లింగ్ కారుగా ఇది నిలుస్తోంది. అయితే ఈ కారును మరింతగా వినియోగదారులకు దగ్గర చేసేందుకు మారుతి సుజుకీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. పండుగ ఆఫర్లలో భాగంగా దీనిని తీసుకొచ్చింది. ఏకంగా రూ. 49,000 వరకూ వివిధ రకాల ప్రయోజనాలు అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టాప్ సెల్లర్..

మన దేశంలో మారుతి సుజుకి నుంచి అక్టోబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన కారు ఈ మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్. వాస్తవానికి గత కొన్ని నెలలుగా దీని కొనుగోళ్ల వృద్ధి రేటు పెరుగూతూ వస్తోంది. అక్టోబర్ 2023లో, మారుతి సుజుకి 22,080 యూనిట్లను విక్రయించింది. అదే అక్టోబర్ 2022లో 17,945 యూనిట్లను విక్రయించింది. అంటే ఈ ఏడాది 23% వృద్ధిని నమోదు చేసింది.

ఆఫర్ ఇలా..

ప్రస్తుతం అన్ని కార్‌మేకర్‌లు ఈ పండుగ సీజన్‌లో కార్లపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ కారుపై కంపెనీ పండుగ డీల్స్ ను ప్రకటించింది. అందులో నగదు తగ్గింపులు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, కార్పొరేట్ ప్రయోజనాలు ఉంటాయి. నవంబర్ చివరి వరకూ వినియోగదారులకు అందుబాటులో ఉండే ఆఫర్ల గురించి చూస్తే.. మారుతి సుజుకి రూ. 25,000 నగదు తగ్గింపుతో పాటు రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. మొత్తం ప్రయోజనాలు కలిపి రూ.49,000 వరకూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

కారు స్పెసిఫికేషన్లు..

మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతోంది. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్. కాగా వీటిల్లో ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ ట్రిమ్స్ సీఎన్జీ వెర్షన్లోకూడా అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 5.54లక్షల నుంచి రూ. 7.42లక్షల వరకూ ఉంటుంది. దీనిలో 1 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5స్పీడ్ ఏఎంటీ టెక్నాలజీతో పాటు మాన్యువల్ ఆప్షన్లలో కూడా ఉంటాయి. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 4 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ పైనే ఆడియో, ఫోన్ కంట్రోల్స్ అందుబాటులో ఉంటాయి. ముందువైపు రెండు ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, పార్కింగ్ సెన్సార్స్, హిల్ హోస్ట్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..