Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price: రానున్న రోజుల్లో ఉల్లి ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా.. కేంద్రం ఏం చెబుతోంది..?

ఉల్లి ప్రస్తుతం మార్కెట్లో ఇదే పెద్ద లోల్లిగా మారింది. సాధారణంగా సగటున ఉల్లిపాయల ధర కిలో రూ. 20 నుంచి రూ. 25 మధ్య ఉంటుంది. ఒక్కోసారి కాపు అధికంగా ఉన్న సమయంలో కిలో రూ. 10కి విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా లభించే వీటి ధరలు అమాంతం ఆకాశానికి అంటాయి. ఇప్పుడు మార్కెట్లో ఉల్లి కొనకుండానే వినియోగదారుని కంట కన్నీరు పెట్టిస్తోంది. అసలే పండుగ సీజన్.. ఇంట్లో ధమ్ బిరియానీ లేకుంటే ముద్ద దిగదు.

Onion Price: రానున్న రోజుల్లో ఉల్లి ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా.. కేంద్రం ఏం చెబుతోంది..?
Central Government Key Announcement On Onion Price Control
Follow us
Srikar T

|

Updated on: Nov 12, 2023 | 7:20 PM

ఉల్లి ప్రస్తుతం మార్కెట్లో ఇదే పెద్ద లోల్లిగా మారింది. సాధారణంగా సగటున ఉల్లిపాయల ధర కిలో రూ. 20 నుంచి రూ. 25 మధ్య ఉంటుంది. ఒక్కోసారి కాపు అధికంగా ఉన్న సమయంలో కిలో రూ. 10కి విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా లభించే వీటి ధరలు అమాంతం ఆకాశానికి అంటాయి. ఇప్పుడు మార్కెట్లో ఉల్లి కొనకుండానే వినియోగదారుని కంట కన్నీరు పెట్టిస్తోంది. అసలే పండుగ సీజన్.. ఇంట్లో ధమ్ బిరియానీ లేకుంటే ముద్ద దిగదు. అలాంటి పరిస్థితుల్లో తప్పని సరిగా ఉల్లి కొనాల్సి వస్తోంది. మన్నటి వరకూ కిలో రూ. 50 లోపూ ఉండగా ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 70కి చేరింది. రానున్న రోజుల్లో ఇది సెంచరీ కొడుతుందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

ఇలా ధరల పెరుగుదలకు ప్రదాన కారణం వరుస పండుగలు రావడంతో డిమాండ్ పెరగడం. ఈ డిమాండుకు తగినంత మార్కెట్లో అందుబాటులో లేకపోవడం. కొందరు రైతులు ఇక్కడ సరైన గిట్టుబాటు ధర రాదన్న ఉద్దేశ్యంతో అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయడం. సకాలంలో కొత్తగా వేసిన ఖరీఫ్ పంట చేతికి రాకపోవడంతో అమాంతం ఉల్లిగడ్డకు డిమాండ్ పెరిగింది. దీంతో పాటూ మన్నటి వరకూ కురిసిన అకాల వర్షాల కారణంగా పంట వేయడంలో జాప్యం చేశారు రైతులు. పై కారణాల దృష్ట్యా ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిన ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. గత ఆగస్టు నుంచి సాగైన పంటను తామే కొనుగోలు చేసి మార్కెట్లోకి విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. ధరలను నియంత్రించడంతో పాటూ కస్టమర్లకు అందుబాటు ధరలోకి తీసుకురావాలని వినియోగదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సరికొత్త ప్రణాళికలను రచిస్తున్నారు.

అందులో భాగంగా ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముందుకొచ్చాయి. కిలో ఉల్లి సామాన్యునికి రూ. 25కే విక్రయించేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఐదు లక్షల టన్నుల ఉల్లిని ప్రభుత్వ గోదాముల్లో నిల్వచేస్తున్నామన్నారు. అవసరమైతే మరో రెండు లక్షల టన్నులను సేకరించేందుకు సిద్దమైనట్లు వెల్లడించారు. కేంద్రం చేపట్టిన చర్యలు దేశవ్యాప్తంగా త్వరలో అమలైతే రానున్న రోజుల్లో కిలో ఉల్లి ధర రూ. 20 నుంచి రూ. 30 మధ్యలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..