Tractor Sales: 7 నెలల్లో 6 లక్షల ట్రాక్టర్ల అమ్మకాలు..! విపరీతంగా కొనుగోలు చేస్తున్న రైతులు.. ఎందుకో తెలుసా..
Tractor Sales: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందా అంటే ఎవరూ చెప్పలేరు. కానీ వ్యవసాయం సరైన దిశలో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.
Tractor Sales: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందా అంటే ఎవరూ చెప్పలేరు. కానీ వ్యవసాయం సరైన దిశలో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైతుల కృషి, శాస్త్రవేత్తల కృషి, ప్రభుత్వ పథకాల ద్వారా దేశంలో వ్యవసాయం మారుతోంది. దాని ప్రభావం భూమిపై కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరం ట్రాక్టర్ విక్రయాలు మునుపటి రికార్డులను బ్రేక్ చేశాయి. ట్రాక్టర్ తయారీదారుల సంఘం (TMA) ప్రకారం.. జూలై వరకు 5,99,993 ట్రాక్టర్లు విక్రయించారు. ఇది గత ఏడాది కంటే దాదాపు 2 లక్షలు ఎక్కువ.
వ్యవసాయ రంగంలో సానుకూల వృద్ధి దీనికి అతిపెద్ద కారణమని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. వ్యవసాయ రంగంలో ఫీల్‌గుడ్‌ను ట్రాక్టర్ల అమ్మకం ద్వారా అంచనా వేయవచ్చు. గ్రామాల్లో ప్రజల వద్ద డబ్బు ఉంది లేదా రుణాన్ని తిరిగి చెల్లించే అధికారం ఉంది. రైతుల రెట్టింపు ఆదాయ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ దల్వాయి ప్రకారం.. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోందని, రైతులు సంతోషంగా ఉన్నారనడానికి ఏ దేశంలోనైనా ట్రాక్టర్ విక్రయాలు నిదర్శనమని తెలిపారు.
ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఛైర్మన్ MJ ఖాన్ ఇలా అంటాడు “కరోనా కాలంలో ప్రజలు నగరాల నుంచి గ్రామాలకు డబ్బు తీసుకువెళ్లారు. వాటిల కనీసం 25 శాతం మంది వ్యవసాయంలో పెట్టుబడి పెట్టారు. వ్యవసాయానికి ట్రాక్టర్ తప్పనిసరి. అందువల్ల దాని కొనుగోలు పెరిగింది. కోవిడ్ కాలంలో వ్యవసాయ రంగం వృద్ధి సానుకూలంగా ఉంది కాబట్టి చాలా మంది ఈ రంగంలో డబ్బు పెట్టుబడి పెడుతున్నారు. వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అందువల్ల ట్రాక్టర్ల విక్రయాలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందన్నాడు”
రైతు సోదరులు భూమిని ట్రాక్టర్‌తో దున్నుతారు, సాగు చేయడానికి సిద్ధం చేస్తారు. విత్తనాలు వేయడం, నాటడం, పంటలు వేయడం, కోత, నూర్పిడి వంటి అనేక రంగాల్లో ట్రాక్టర్ ఉపయోగిస్తారు. వ్యవసాయానికి అతిపెద్ద ఆధునిక ఆయుధం ట్రాక్టర్. అందువల్ల వ్యవసాయం పరిధి పెరిగినప్పుడు వీటి అమ్మకాలు కూడా పెరుగుతాయి. కాలక్రమేణా, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుతోంది.