- Telugu News Photo Gallery Business photos Post office gram suraksha scheme Rs 1400 monthly premium for Rs 35 lakh maturity postal insurance whole life assurance details
Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రూ.1400 ప్రీమియంతో రూ.35 లక్షల వరకు పొందవచ్చు.. పూర్తి వివరాలు!
Post Office: పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల స్కిమ్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు రాబడి పొందే విధంగా పోస్టల్ శాఖ వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతోంది..
Updated on: Aug 20, 2021 | 7:48 AM

Post Office: పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల స్కిమ్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు రాబడి పొందే విధంగా పోస్టల్ శాఖ వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. పోస్టాఫీసులో ఉండే వివిధ రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డబ్బుల్లో పెట్టడం వల్ల రిస్క్ లేకుండానే రాబడి పొందవచ్చు.

పోస్టాఫీస్‌లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా పొందొచ్చు. వీటిల్ల గ్రామ్ సురక్ష స్కీమ్ కూడా ఒకటుంది. మరణం తర్వాత మెచ్యూరిటీ ప్రయోజనాలతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అలాగే రెండు రకాల బోనస్‌లు కూడా ఇందులో చేర్చారు. ఈ గ్రామ సురక్ష స్కీమ్‌ను లైఫ్ అస్యూరెన్స్ పాలసీ అని కూడా అంటారు.

19 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. 55 ఏళ్ల వరకు వయసులో ఉన్న వారు ఈ పాలసీ పొందటానికి అర్హులు. కనీసం రూ.10 వేల మొత్తానికి బీమా తీసుకోవాలి. గరిష్టంగా రూ.10 లక్షల వరకు బీమా మొత్తానికి పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. పాలసీ తీసుకున్న నాలుగేళ్ల తర్వాత లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది.

ఈ పాలసీపై ఇండియా పోస్టల్ రూ.1000కి రూ.60 బోనస్ అందించింది. అంటే రూ.లక్షకు ఏడాదికి రూ.6 వేల బోనస్ వచ్చినట్లు అవుతుంది. ఈ పథకాన్ని మూడు సంవత్సరాలల తర్వాత కూడా సరెండర్ చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు మీరు గ్రామ సురక్ష పథకాన్ని ముగించుకుంటే బోనస్ ప్రయోజనం లభించదు.

ఇందులో మూడు ప్రీమియం చెల్లింపులు ఎంపిక చేయబడ్డాయి. 55 సంవత్సరాలు, 58 సంవతస్రాలు, 60 సంవత్సరాలు. ఎవరైనా ఈ పథకానికి 19 ఏళ్ల వయసులో నమోదు చేసుకుంటే అతని ప్రీమియం టర్మ్ 36 సంవత్సరాలు, 39 సంవత్సరాలు, 41 సంవత్సరాలు. అతను 55,58 లేదా 60 ఏళ్ల వయసులో తీసుకుంటే మెచ్యూరిటీ మొత్తం దాదాపు 35 లక్షలు ఉంటుంది.

19 ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన సురక్ష పాలసీని కొనుగోలు చేసినప్పుడు 55 సంవత్సరాల నెలవారీ ప్రీమియం రూ.1515, 58 సంవత్సరాలకు రూ.1463, 60 సంవత్సరాలకు రూ.1411, 55 సంవత్సరాల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.31.60 లక్షలు రూ.58 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.34.60 లక్షలు ఉంటుంది.

గ్రామ సురక్ష పాలసీలో నామినీ సౌకర్యం కూడా ఉంది. కస్టమర్ ఇ-మెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మీకు సమీపంలో ఉన్న పోస్టాఫీసును సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే టోల్ ప్రీ నెంబర్ 1800 180 5232/155232కు కాల్ చేయవచ్చు. లేదా వెబ్‌సైట్ http://www.postallifeinsurance.gov.in/ ద్వారా కూడా పూర్తి సమాచారం పొందవచ్చు.





























