Silver Price Today: వెండి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగి వచ్చిన ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..
Silver Price Today: భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల నుంచి తగ్గుతూ పెరుగుతున్న..
Silver Price Today: భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల నుంచి తగ్గుతూ పెరుగుతున్న సిల్వర్.. తాజాగా బంగారం ధరలు తగ్గితే అదే బాటలో వెండి పయనిస్తోంది. కిలో వెండి ధరపై భారీగా తగ్గుముఖం పట్టింది. దేశీయంగా కిలో రూ.70 వేల వరకు ఉన్న వెండి.. రోజురోజుకు దిగివస్తోంది. దాదాపు కిలో వెండిపై వెయ్యి రూపాయల వరకు దిగివచ్చింది. శుక్రవారం (ఆగస్టు 20) ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.62,500 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.67,400 ఉండగా, కోల్‌కతాలో రూ.62,500 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.62,500 ఉండగా, కేరళలో రూ.67,400 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.62,500 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,400 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.67,400 ఉండగా, విశాఖపట్నంలో రూ.67,400 ఉంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిది.
అయితే బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.