Pre-Approved Loan: ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ అంటే ఏమిటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఎలాంటి అర్హతలుండాలి..?

Pre-Approved Loan: ఏదైనా రుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయింది. రుణాలు పొందాలంటే సులభతరంగా పొందే సదుపాయాలు వచ్చేశాయి..

Pre-Approved Loan: ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ అంటే ఏమిటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఎలాంటి అర్హతలుండాలి..?
Pre Approved Loan
Follow us
Subhash Goud

|

Updated on: Aug 18, 2021 | 12:47 PM

Pre-Approved Loan: ఏదైనా రుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయింది. రుణాలు పొందాలంటే సులభతరంగా పొందే సదుపాయాలు వచ్చేశాయి. ఒకప్పుడు రుణం కోసం బ్యాంకుకు వెళ్లి మేనేజర్‌ను సంప్రదించి తర్వాత బ్యాంకుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చే. అయితే కొన్ని రుణాలు మరి సులభంగా వచ్చే అవకాశాలున్నాయి. బ్యాంకు వెళ్లాల్సిన పని లేకుండా ఎక్కువ డాక్యుమెంటేషన్‌ లేకుండా కొంత మందికి బ్యాంకులు వ్యక్తిగత రుణాలను ఇస్తుంటాయి. వాటిని ప్రీ అఫ్రూవ్డ్‌ లోన్స్‌ అంటారు. అంటే ముందుగా ఆమోదించిన వ్యక్తిగత రుణం అని అర్థం. ఇలాంటి లోన్‌ మీకూ మంజూరు అయ్యిందంటూ… బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి మెసేజ్‌లు, కాల్స్‌ వ‌స్తుంటాయి. మీకూ ఇలాంటి లోన్లకు సంబంధించిన కాల్స్‌, మెసేజ్‌లు గతంలో వచ్చే ఉంటాయి. అసలేంటీ ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌, వాటిని తీసుకోవడం మంచిదేలా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.

రుణదాత మీకు కాల్ చేసి, ముందుగా ఆమోదించిన రుణం లేదా తక్షణ ఆమోదం పొందిన రుణానికి మీరు అర్హులని చెప్పారంటే, దాని అర్ధం వారు మీ ప్రొఫైల్ సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని మీకు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చారని అర్థం. అంటే మీ ఆదాయం, చెల్లింపుల చరిత్ర, బ్యాంకు ఖాతాకు సంబంధించిన డెబిట్ / క్రెడిట్లు, సిబిల్ స్కోర్‌ తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని మీకు రుణం ఇవ్వాలని అనుకుంటే లోన్‌ ఆఫర్‌ చేస్తారు. ఇలా ముందుగా ఆమోదించిన రుణాల‌కు చాలావ‌ర‌కు సెక్యూరిటీ ఉండదు. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ లేదా ఫిన్‌టెక్ లెండ‌ర్లు రుణాల‌ను మంజూరు చేస్తారు. ఒకవేళ మీకు ఇలాంటి ఫోన్‌కాల్స్‌ వచ్చినట్లయితే మీ అవసరాన్ని బట్టి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఫోన్ కాల్‌ వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా రుణం పొందుతారని అనుకోవద్దు. అప్పు తీసుకోవడంలో కేవలం మొదటి స్టెప్‌ మాత్రమే పూర్తి చేసినట్లు అని గుర్తించాలి. ఇంకో విషయం గమనించాల్సింది ఏమింటంటే.. ముందుగా ఆమోదించిన రుణానికి సమయ పరిమితి ఉంటుంది. ఒకవేళ ఇలా మీరు రుణం తీసుకున్నట్లయితే దానిని కేవలం కొన్ని నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా ఆరు నెలలుగా ఉంటుంది. అలాగే ముందుగానే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

ఇలాంటి రుణాలకు అర్హత‌ ఏమిటి:

ముందుస్తు రుణాల‌ను ఆమోదించేందుకు దీర్ఘకాలం పాటు బ్యాంకుతో సంబంధాలు కొన‌సాగించ‌డం, మంచి క్రెడిట్ స్కోరు, బ్యాంకు బ్యాలెన్స్ నిర్వహ‌ణ‌, పొదుపు చ‌రిత్ర, ఆదాయం, తీసుకున్న రుణం తిరిగి చెల్లించ‌డంలో ఉత్తమ రికార్డు వంటివి ఉండటం ఎంతో ముఖ్యమని గుర్తించుకోండి. దీంతోపాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అర్హత‌ను ప‌రిశీలిస్తారు బ్యాంకు అధికారులు.

ఎలాంటి పత్రాలు అవసరం..

సాధార‌ణంగా బ్యాంకులు, వారి ఖాతాదారుల‌కు ముందుగా ఆమోదించిన రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తాయి. అందువ‌ల్ల చాలా త‌క్కువ లేదా అస‌లు ఎలాంటి డాక్యుమెంటేష‌న్ లేకుండా రుణాల‌ను మంజూరు చేసే అవకాశాలుంటాయి. ఒక‌వేళ మీరు బ్యాంకు ఖాతాదారుడు కాక‌పోతే రుణదాత మీ ఆరు నెల‌ల బ్యాంకు స్టేట్‌మెంట్లు, మూడు నెల‌ల శాల‌రీ స్లిప్‌లు, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్‌, పాన్ కార్డు వంటి ఐడీ ప్రూఫ్‌లు అడుగుతారు.

ప్రాసెసింగ్ సమయం తక్కువ:

ముందుగా మీకు ఆమోదించిన రుణానికి ప్రాసెసింగ్‌ సమయం చాలా తక్కువగా ఉంటుంది. రుణాన్ని ముందుగానే ఆమోదించారు కాబట్టి.. మీ ప్రాథమిక వివరాలు రుణదాత వద్ద ఉంటాయి. అందుకే చాలావరకు ప్రాసెస్‌ ముందుగానే పూర్తవుతుంది. మీరు కేవలం వారు అడిగిన పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. రుణం త్వరగా అందే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ప్రాసెసింగ్ సమయం తగ్గడంతో పాటు ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.

ముందుగా ఆమోదించిన రుణానికి తక్కువ వడ్డీ:

చాలా సందర్భాలలో ముందుగానే ఆమోదించిన రుణాలకు తక్కువ వడ్డే ఉంటుంది. ఎందుకంటే మంచి క్రెడిట్ స్కోర్‌, ఖాతా స్థితిగతులు, స్థిర డిపాజిట్లు ఉన్న వారికే ముందుగా ఆమోదం పొందిన రుణాలను అందిస్తాయి. అలాంటి వారు డీఫాల్ట్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాన్ని అందిస్తాయి.

రుణాలను చెల్లించే సమయం:

ముందుగా ఆమోదించిన రుణాల‌ను తిరిగి చెల్లించేందుకు కావ‌ల‌సిన స‌మ‌యాన్ని రుణ గ్రహీత ఎంపిక చేసుకోవ‌చ్చు. చాలా బ్యాంకులు డబ్బులు తిరిగి చెల్లించేందుకు 12 నెల‌ల నుంచి 60 నెల‌ల వ‌ర‌కు స‌మ‌యాన్ని ఇస్తుంటాయి.

ద‌ర‌ఖాస్తు చేయ‌డం ఎలా?

ముందుగానే ఆమోదించిన రుణాలకు మీరు బ్యాంకు ప్రతినిధిని సంప్రదించి అవసరమైన పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. నిబంధనల ప్రకారం అన్ని పూర్తయిన తర్వాత మీ రుణ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జ‌మ చేస్తారు.

ఆన్‌లైన్‌లోనూ ద‌ర‌ఖాస్తు చేస్తుకోవ‌చ్చు…

1. ముందుగా మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాలో లాగిన్ అవ్వాలి.

2. రుణ విభాగంలోని ‘ప్రీ అప్రూవ్‌డ్ లోన్స్‌’ను ఎంపిక చేసుకోవాలి.

3. ‘అప్లై నౌ’ పై క్లిక్ చేయాలి.

4. పాప్ అప్‌లో మీరు తీసుకునే రుణ ర‌కాన్ని ఎంపిక చేసుకుని ‘అప్లై నౌ’ పై క్లిక్ చేయాలి.

5. ఫామ్‌ను పూర్తిగా పూరించాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి Bank Customers: బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక నుంచి ఆ బ్యాంకులో వడ్డీ రేట్లు తగ్గింపు..!

PAN Card: నిమిషాల్లోనే ఈ-పాన్‌ కార్డు పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా