Bank Customers: బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక నుంచి ఆ బ్యాంకులో వడ్డీ రేట్లు తగ్గింపు..!

Bank Customers: వివిధ బ్యాంకులు తమ కస్టమర్లకు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు, వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అలాగే బ్యాంకులు వడ్డీ రేట్లపై..

Bank Customers: బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక నుంచి ఆ బ్యాంకులో వడ్డీ రేట్లు తగ్గింపు..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 18, 2021 | 9:53 AM

Bank Customers: వివిధ బ్యాంకులు తమ కస్టమర్లకు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు, వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అలాగే బ్యాంకులు వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా కస్టమర్లకు షాకిచ్చింది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు. ఈ బ్యాంకులు మీకు అకౌంట్‌ ఉన్నట్లయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువస్తోంది. ఈ నిర్ణయం కారణంగా బ్యాంక్ ఖాతాదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీని వల్ల బ్యాంక్‌లో అ కౌంట్‌ ఉన్న వారికి వారి డిపాజిట్లపై తక్కువ వడ్డీ లభించనుంది. బ్యాంకు ఇప్పటికే ఈ విషయాన్ని తెలియజేసింది.

ప్రస్తుతం బ్యాంకు కస్టమర్లకు వారి సేవింగ్స్ ఖాతాలపై 3 శాతం వడ్డీ లభిస్తుండగా, సెప్టెంబర్ 1 నుంచి ఈ వడ్డీ రేటు 2.9 శాతానికి తగ్గనుంది. ఇప్పటికే బ్యాంక్ ఖాతా కలిగిన వారికి, అలాగే కొత్తగా బ్యాంక్ ఖాతా తెరిచే వారికి ఈ తగ్గింపు రేటు వర్తిస్తుంది. ఇకపోతే దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (SBI) సేవింగ్స్ అకౌంట్లపై 2.7 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ విషయాలను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారు తెలుసుకోవడం మంచిది. ఇప్పటికే డిపాజిట్‌ ఖాతాలు ఉన్నవారు కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఇది వరకు ఎక్కువ వడ్డీని పొందిన వారు.. ఇప్పటి నుంచి తక్కువ వడ్డీని పొందాల్సి ఉంటుంది.

అలాగే వివిధ బ్యాంకులు పండగ సీజన్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు పండగ ఆఫర్లను అందిస్తున్నాయి. వివిధ రకాల రుణాల ప్రాసెసింగ్‌ ప్రక్రియలో విధించే రుసుములపై మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను సవరిస్తూ వస్తున్నాయి. ఇక సీజన్‌ సిటిజన్స్‌కు మాత్రం మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి

PAN Card: నిమిషాల్లోనే ఈ-పాన్‌ కార్డు పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు

HDFC: హెడీఎఫ్‌సీ కస్టమర్లకు పండగ ఆఫర్లు.. ఈ రుణాలపై మినహాయింపులు.. డిస్కౌంట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా