Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులో.. ఇకపై ఆ పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు..!
Whatsapp: ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ తప్పనిసరి. ఉదయం లేదించి మొదలు రాత్రి పడుకోబోయే వరకు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లలో అధికంగా ఉపయోగించేది..
Whatsapp: ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ తప్పనిసరి. ఉదయం లేదించి మొదలు రాత్రి పడుకోబోయే వరకు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లలో అధికంగా ఉపయోగించేది వాట్సాప్. ఈ యాప్ తో స్నేహితులతో ముచ్చట్లు, కుటుంబ సభ్యులతో చాటింగ్‌లు ఇలా రకరకాలుగా వాట్సాప్‌లో మునిగితేలిపోతున్నారు. అయితే వాట్సాప్ వినియోగం పెరుగుతుండటంతో వాట్సాప్ సంస్థ రోజురోజుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ ఇక పేమెంట్ విషయంలో కూడా ఫీచర్స్ తీసుకువస్తోంది. అయితే ఇన్ని రోజులు వాట్సాప్ లో చాటింగ్ చేసిన మనం ఇకపై ఆర్ధిక లావాదేవీలను చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామయ్యంలో వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను మంగళవారం ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ పే తరహాలో మనీ ట్రాన్స్ ఫర్ చేసేందుకు రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా వాట్సాప్ పేమెంట్ డైరక్టర్ మనేష్ మహాత్మే మాట్లాడుతూ.. వాట్సాప్ నుంచి 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా డబ్బులను ట్రాన్సాఫర్ చేయడం. అందుకే భవిష్యత్‌లో వాట్సాప్‌కు మరిన్ని ఫీచర్లను అప్‌డేట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
వాట్సాప్ నుంచి డబ్బులు పంపడం ఎలా?
► ముందుగా వాట్సాప్ డ్యాష్ బోర్డును ఓపెన్ చేయాలి.
► కుడివైపు టాప్‌లో ఉన్న మూడు చుక్కలపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది.
► ట్యాప్ చేస్తే మీకు న్యూ గ్రూప్, న్యూ బ్రాడ్ కాస్ట్, లింక్డ్ డివైజెస్, స్టార్డ్ మెసేజెస్‌తో పాటు చివరిగా పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది
► ఆ పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
► అలా పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పేమెంట్స్ ఆప్షన్ తో డ్యాష్ బోర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో కంటిన్యూ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
► తర్వాత మీకు నచ్చిన బ్యాంక్ ను ఎంపిక చేసుకోవాలి.
► ఆ తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
► వెరిఫై చేసుకున్న తర్వాత న్యూ పేమెంట్ ఆప్షన్‌లో మీరు ఎవరికైతే డబ్బులు పంపాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ నెంబర్ మీద క్లిక్ చేసి.. డబ్బులను పంపుకోవాలి.