Color Identify: పురుషుల కంటే మహిళలే ఎక్కువ రంగులను గుర్తిస్తారట.. పరిశోధనలలో ఆసక్తికర విషయాలు?

Color Identify: పురుషుల కంటే మహిళలే ఎక్కువ రంగులను గుర్తిస్తారట.. పరిశోధనలలో ఆసక్తికర విషయాలు?
Color Identify

Color Identify: రంగులు.. ప్రపంచంలో రంగులు అనేవి లేకపోతే అసలు ఊహించలేము కదా! రంగులు మనకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. మన జీవితమే ఒక వర్ణచిత్రం...

Subhash Goud

|

Aug 18, 2021 | 7:17 AM

Color Identify: రంగులు.. ప్రపంచంలో రంగులు అనేవి లేకపోతే అసలు ఊహించలేము కదా! రంగులు మనకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. మన జీవితమే ఒక వర్ణచిత్రం. అనుక్షణం పలు రకాల రంగులు మనల్ని పలకరిస్తుంటాయి. మ‌న‌తో ప్రయాణం చేస్తుంటాయి. నీరు, గాలి, భూమి, ఆకాశాల్లా రంగులు సైతం ప్రపంచం మొత్తానికీ ఒకటే. అలాంటి రంగుల గురించి కొన్ని క‌ల‌ర్‌ఫుల్ నిజాలు దాగివున్నాయి. ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే రంగు నీలం. ఈ విషయం ప‌లు అంత‌ర్జాతీయ అధ్యయనాల్లో రుజువైంది. గ్లోబ‌ల్ మార్కెట్‌ కంపెనీలు సైతం ఇదే చెబుతున్నాయి. ప్రపంచ‌వ్యాప్తంగా బ్లూని 40 శాతం మంది ఇష్టప‌డుతున్నారు. దీని త‌రువాత స్థానంలో పర్‌పుల్ ఉంది. దీన్ని 14శాతం మంది ఇష్టప‌డుతున్నారు. ఎరుపు, ఆకుప‌చ్చ కూడా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయ‌ని కొంత‌మంది ప‌రిశోధ‌కులు అంటున్నారు. అభిమాన రంగులుగా ఆఖ‌రిస్థానాల్లో ఉన్నవి తెలుపు, ఆరంజ్‌, ప‌సుపు.

రంగుల గుర్తింపుపై పరిశోధకుల అధ్యయనాల ప్రకారం.. అయితే పిల్లలు మొట్టమొదట గుర్తించే రంగు ఎరుపు. రెండు వారాల వయసు నుంచి పిల్లలు ఎరుపు రంగును గుర్తిస్తారని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇక పురుషుల కంటే మ‌హిళ‌లు ఎరుపు రంగు షేడ్‌ల‌ను ఎక్కువ‌గా గుర్తించ‌గ‌లుగుతారు. ఎందుకంటే ఈ రంగుని గుర్తించే జీన్ ఎక్స్ క్రోమోజోమ్‌లో ఉంది. మ‌హిళ‌ల్లో ఎక్స్ క్రోమోజోములు రెండు ఉంటే పురుషుల్లో ఒక్కటే ఉంటుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలుసు. ఎరుపు ఒక్కటే కాదు, రంగుల మ‌ధ్య అతి చిన్న తేడాని సైతం మ‌హిళ‌లే ఎక్కువ‌గా గుర్తిస్తారట. మ‌గ‌వారు వ‌స్తువుల క‌ద‌లిక‌ల‌ను నిశితంగా గ‌మ‌నించ‌గ‌లుగుతార‌ట‌.

హర్మోన్లు మహిళలకు రంగులను గుర్తించడంలో సహాయపడతాయి

మహిళలు, పురుషులు రంగుల గుర్తింపు అధ్యయనం చేసే న్యూయార్క్‌ (USA)లోని బ్ల్రూక్లిన్‌ కాలేజీ ఈ అధ్యయనాల నుంచి చాలా విషయాలు బయటకు వచ్చాయి. రంగులను గుర్తించడం అనేది పురుషులు, స్త్రీలలో విభిన్నమైన హర్మోన్లకు సంబంధించినది అని అధ్యయనం పేర్కొంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. పురుషులు, మహిళల అభివృద్ధి సమయంలో టెస్టోస్టెరాన్‌ వ్యక్తీకరణ మెదడు విజువల్‌ కర్టెక్స్‌లో ఉన్న న్యూరాన్‌లను ప్రభావితం చేస్తుంది. అలాగే వెబ్‌సైట్‌ లో  కూడా ఇందుకు సంబంధించిన పలు వివరాలు ఉన్నాయి.

పింక్‌కు కోపాన్ని తగ్గించే గుణం..

కాగా, పింక్‌ రంగుకు కోపాన్ని, ఆందోళనని తగ్గించే శక్తి ఉంది. అందుకే ఖైదీలు ఉండే జైళ్లుకు, మాన‌సిక రోగులు ఉండే చికిత్సా కేంద్రాల‌కు ఈ రంగుని వేస్తారు. కార్లకు సుర‌క్షిత‌మైన రంగు తెలుపు. మంచులో తప్ప మిగిలిన ఎలాంటి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో అయినా స్పష్టంగా క‌నిపించే రంగు తెలుపు అని అధ్యయ‌నాలు చెబుతున్నాయి. నిజానికి నిమ్మ ప‌సుపు రంగు రోడ్డుమీద మ‌రింత ఎక్కువ‌గా క‌నిపించే రంగు అయితే ఈ రంగులో కార్లు త‌క్కువ క‌నుక తెలుపుకే ఈ ప్రాధాన్యత దక్కింది. తెలుపు త‌రువాత సిల్వర్, కార్లకు త‌గిన రంగు.

ఆకలిని పెంచే రంగులు:

ఆకలిని పెంచే రంగులు సైతం కూడా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఎరుపు, ప‌సుపు ఈ రెండు రంగులు ఆక‌లిని పెంచుతాయి. అందుకే కెఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్స్ లాంటి ఆహార త‌యారీ సంస్థలు ఈ రంగులను ఎక్కువగా వాడుతుంటాయి. ఆక‌లిని క‌లిగించే రంగుల్లో చివర ఉన్నది నీలం.

ఇవీ కూడా చదవండి  ATM Fraud: మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్రత్త.. మీ కార్డు క్లోనింగ్‌కు గురయ్యే అవకాశం..!

High Blood Pressure: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా.? ఈ ఐదు మార్గాలను అనుసరిస్తే అదుపులో ఉంటుంది..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu