- Telugu News Photo Gallery Business photos HDFC Bank brought bumper offers, various discounts on interest rates and processing fees
HDFC: హెడీఎఫ్‌సీ కస్టమర్లకు పండగ ఆఫర్లు.. ఈ రుణాలపై మినహాయింపులు.. డిస్కౌంట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి
HDFC Bumper Offers: కస్టమర్లకు మరింత మేలు చేకూర్చేందుకు వివిధ రకాల ఆఫర్లను కల్పిస్తుంటాయి బ్యాంకులు. కొత్త కొత్త స్కీమ్‌లో, రుణాలపై ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇక తాజాగా ..
Updated on: Aug 18, 2021 | 9:34 AM

HDFC Bumper Offers: కస్టమర్లకు మరింత మేలు చేకూర్చేందుకు వివిధ రకాల ఆఫర్లను కల్పిస్తుంటాయి బ్యాంకులు. కొత్త కొత్త స్కీమ్‌లో, రుణాలపై ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇక తాజాగా పండగ సీజన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ వినియోగదారులకు డిస్కౌంట్, ఇతర ఆఫర్లను కల్పిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన కస్టమర్లకు పంగడ ఆఫర్లను ప్రకటించగా, ఇప్పుడు తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ కూడా అందిస్తోంది.

బ్యాంకింగ్ రంగం రిటైల్ రుణగ్రహీతలకు వివిధ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెక్యూరిటీ లోన్స్‌ల కోసం ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఇచ్చింది. రుణాలపై వడ్డీ రేటు 9.90 శాతం ఉంటుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

సెక్యూరిటీ లోన్ కింద, కస్టమర్ తన హోల్డింగ్ షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు, ఇతర వాటిపై రుణాలను పొందవచ్చు. ఇందులో కనీసం రుణ విలువ రూ .2 లక్షలు ఉండాలి. ఇందులో ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, LIC పాలసీ, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, గోల్డ్ డిపాజిట్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పాత్ర, నాబార్డ్ భవిష్య నిర్మాణ బాండ్, కన్వర్టబుల్ డిబెంచర్లు ఉన్నాయి.

ఈ సెక్యూరిటీ పత్రాలపై రుణాలు పొందవచ్చు. మీరు ఈ రుణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే, రుణం మొత్తం వీలైనంత త్వరగా చెల్లించబడుతుంది. ఈ రుణాలు పొందాలంటే.. హెచ్‌డీఎఫ్‌సీ నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వండి. ఇక్కడ డీమ్యాట్ ఖాతా ఎంపిక చేసుకోవాలి.

అక్కడ సెక్యూరిటీ లోన్స్ ఆప్షన్‌ను ఎంపికను చేసుకోవాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. ఎన్‌ఎస్‌డీఎల్, సీఎస్‌డీఎల్ సహాయంతో మీ వాటాలను ఆన్‌లైన్‌లో కండిషన్లను అంగీకరించిన తర్వాత రుణంపై ప్రాసెసింగ్ మొదలై తర్వాత రుణం మంజూరు అవుతుంది.




