Bank Holidays: బ్యాంకుల్లో పనుంటే ఇవాళే ప్లాన్ చేసుకోండి.. రేపటి నుంచి ఐదు రోజులపాటు సెలవులు..
మీరు కూడా రేపు, ఎల్లుండి కాని బ్యాంకులో ఏమైన పని ఉంటే ఈ రోజే చేసుకోండి. ఎందుకంటే రాబోయే ఐదు రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడి ఉంటాయి. అయితే, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉంటాయి.
మీరు కూడా రేపు, ఎల్లుండి కాని బ్యాంకులో ఏమైన పని ఉంటే ఈ రోజే చేసుకోండి. ఎందుకంటే రాబోయే ఐదు రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడి ఉంటాయి. అయితే, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉంటాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో, స్థానిక పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు నిర్ణయించారు. బ్యాంకింగ్ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలలో జరుపుకునే పండుగలపై ఆధారపడి ఉంటాయి. రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు సెలవుల జాబితాను కూడా చూడాలి.
ఆగస్టు నెల బ్యాంకు సెలవుతో ప్రారంభమైంది. ఆగస్టు 1 ఆదివారం వారపు సెలవు. ఆగస్టు నెలలో 5 ఆదివారం సెలవులు ఉన్నాయి. వీటిలో మూడు ముగిసాయి. రెండు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఆగస్టు 22 నుంచి 29 తేదీ వరకు అంటే ఈ వారపు సెలవు దినాలలో బ్యాంకులు ఆదివారం మూసివేయబడతాయి.
ఆగస్టులో వరుసగా ఐదు రోజులు బ్యాంకింగ్ సెలవు
- ఆగస్టు 19: ముహర్రం (త్రిపుర, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాలు)
- ఆగస్టు 20: ఓనం (కర్ణాటక, కేరళ, తమిళనాడు)
- ఆగస్టు 21: తిరువోనం (కేరళ)
- 22 ఆగస్టు 2021 – వీక్లీ హాలిడే (ఆదివారం)
- 23 ఆగస్టు: శ్రీ నారాయణ గురు జయంతి (కేరళలో సెలవు)
ఈ నెలలో చాలా రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి.
- ఆగస్టు 28 – నెలలో నాల్గవ శనివారం
- ఆగస్టు 29 – ఆదివారం
- ఆగస్టు 30- జన్మాష్టమి/కృష్ణ జయంతి- అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టాక్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, పాట్నా, రాయ్‌పూర్,
- రాంచీ, షిల్లాంగ్, సిమ్లా మరియు శ్రీనగర్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి.
- ఆగస్టు 31 – శ్రీ కృష్ణ అష్టమి – హైదరాబాద్‌లో బ్యాంక్ మూసివేయబడింది.
ముందుగా తెలుసుకోండి..
ఈ నెల ప్రారంభంలో ఆగస్టు 14 , 15 తేదీలలో వరుసగా రెండు రోజులు బ్యాంకులు సెలవులు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం వివిధ పండుగల కారణంగా బ్యాంకులలో సుదీర్ఘ సెలవులు ఉంన్నాయి. అందువల్ల మీరు మీ ముఖ్యమైన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఎందుకంటే సెలవుల తర్వాత బ్యాంకులు తెరిచిన సమయంలో భారీ రద్దీ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ ముఖ్యమైన పనిపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.
ప్రతి ఆదివారం.. నెలలో రెండవ, నాల్గవ శనివారాలలో బ్యాంకులకు సెలవులు. ఇది కాకుండా వివిధ పండుగలు, ఉత్సవాలు లేదా ప్రతి రాష్ట్రంలో ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కారణంగా ఆ రాష్ట్రంలో బ్యాంకుల్లో సెలవులు ఉంటాయి. అయితే, ఈ సెలవులు నెట్ బ్యాంకింగ్ పై ఎలాంటి ప్రభావం చూపవు. ఈ సేవ యధావిధిగా కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి: Afghanistan Crisis: యాక్షన్.. రియాక్షన్.. తాలిబన్ల చెర నుంచి మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ సైన్యం