AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: యాక్షన్.. రియాక్షన్.. తాలిబన్ల చెర నుంచి మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ సైన్యం

అధికారాన్ని కోల్పోయినా ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమరుల్లా సలేహ్ సైన్యం తాలిబన్‌పై దాడులను ముమ్మరం చేసింది. కాబూల్‌కు ఉత్తరాన ఉన్న పర్వాన్ పోవిన్స్‌లోని చారికర్ ప్రాంతాన్ని తాలిబాన్ నుండి..

Afghanistan Crisis: యాక్షన్.. రియాక్షన్.. తాలిబన్ల చెర నుంచి మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ సైన్యం
Afghan Vice President Amrul
Sanjay Kasula
|

Updated on: Aug 18, 2021 | 10:31 AM

Share

మొన్నటి వరకూ ఉన్న ప్రెసిడెంట్‌ ఘనీ ఫ్లైటెక్కి పారిపోయాడు. మహా మహా ఘనులే దారిచూసుకున్నారు. కానీ పూర్తిగా తాలిబన్‌ తుపాకీ నీడలోకి వెళ్లి పోయిన ఆఫ్గన్‌లో ఓ కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. అదే చారికర్‌. అలాగే ఓ వ్యక్తి సంచలనం అయ్యాడు.. అతనే అమ్రుల్లా సలేహ్. అధికారాన్ని కోల్పోయినా ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమరుల్లా సలేహ్ సైన్యం తాలిబన్‌పై దాడులను ముమ్మరం చేసింది. కాబూల్‌కు ఉత్తరాన ఉన్న పర్వాన్ పోవిన్స్‌లోని చారికర్ ప్రాంతాన్ని తాలిబాన్ నుండి స్వాధీనం చేసుకుంది. వ్యూహాత్మకంగా క్రికర్ నుండి ముఖ్యమైన రహదారి సొరంగం గుండా దాడులు చేస్తున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ (కాబూల్ ఆఫ్ఘనిస్తాన్) అతిపెద్ద నగరం మజార్-ఇ-షరీఫ్‌ను కలుపుతుంది. సాలెహ్ మాట్లాడుతూ..  ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఎక్కడికి పారిపోలేదని అతను దేశంలోనే ఉన్నాడని ప్రకటించాడు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అష్రఫ్ ఘని తమ అధ్యక్షుడిని తెలిపాడు.

కాబూల్‌లోని ఒక సైనిక నాయకుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రావిన్స్ చుట్టూ ఉన్న ప్రాంతంలో పంజ్‌షీర్ జార్జ్ శివార్లలో తాలిబాన్‌లతో పోరాటం జరుగుతోందని  వెల్లడించాడు. “ఆఫ్ఘనిస్తాన్ మొదటి వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ సైన్యం పర్వాన్ ప్రావిన్స్‌లోని చారికర్ ప్రాంతంలో నియంత్రణ సాధించింది ” అని  వెల్లడించాడు. ఇప్పుడు పంజ్‌షీర్ ప్రాంతంలో పోరాటం జరుగుతోందని తెలిపాడు.

చారికర్ అనేది ఆఫ్గనిస్తాన్‌లోని ఓ చిన్న పట్టణం. పార్వన్‌ ప్రావిన్స్‌లో ఉంది. ఈ చిన్నపట్టణంలోనే వైస్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సలేహ్ ఉంటున్నాడు. ఆఫ్గన్‌లు విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే, దేశంలో జనం యావత్తూ పారిపోవాలని చూస్తుంటే.. ఒక్క అమ్రుల్లా మాత్రం తిరుగుబాటుకు రెడీ అయ్యాడు.

రెడీ ఏంటి.. తాను ఉంటున్న చారికర్‌ సిటీని తన ఆధీనంలోకి తీసేసుకున్నాడు. ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ సెన్సేషన్‌. చారికర్ చిన్నపట్టణమే కావచ్చు. కానీ అధికారిక తిరుగుబాటన్నది అక్కడి నుంచే మొదలైంది. ప్రభుత్వ సైన్యంతో తాలిబన్లను ఎదురొడ్డి నిలిచాడు. చారికర్‌ తన సామ్రాజ్యంగా ఫిక్సైపోయాడు.

ప్రపంచం గుర్తించిన ఆప్ఘనిస్థాన్‌ ఎంతుటుందో తెలుసా… మొత్తం విస్తీర్ణం 6లక్షల 52వేల 860 స్కేర్ కిలోమీటర్లు. దేశం మొత్తం జనాభా 38మిలియన్లు. అటూ ఇటుగా 4కోట్లు అని చెప్పుకోవచ్చు. 34 ప్రావిన్స్‌లు… 421 జిల్లాలున్నాయి. ఇంతటి ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితి 10 రోజుల్లో మారిపోయింది. మొదట సరిహద్దుల్లో పాగా వేసిన తాలిబన్లు.. ఆదేశానికి బయట దేశాలతో ఉన్న సంబంధాలను కట్టడి చేశారు.

ఆ తర్వాత మెల్లగా 34 ప్రావిన్స్‌లలోని కీలక పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. మెల్లిగా రాజధాని కాబూల్ వరకూ విస్తరించారు. 10 రోజుల్లో చిన్నా చితక ప్రాంతాలు తప్ప మొత్తం తుపాకీ నీడలోకి వెళ్లిపోయిన దృశ్యాలు ఇప్పుడు అక్కడ మనకు కనిపిస్తున్నాయి.

తాలిబాన్లు ఆదివారం కాబూల్‌ను స్వాధీనం

అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ముందుగా తజకిస్తాన్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో ఉన్నారని అల్ జజీరా వార్తా సంస్థ పేర్కొంది. అధ్యక్షుడు వ్యక్తిగత బాడీగార్డు ఒకరు ఈ విషయాన్ని చెప్పారని వెల్లడించింది. అయితే, దీన్ని ప్రభుత్వం ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు.

 ఇవి కూడా చదవండి: Aadhaar EKYC: ఏపీలో సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులకు EKYC కష్టాలు.. స్పందించిన అధికారులు.. ఏం చేశారో తెలుసా..

Jana Ashirwad Yatra: ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన యాత్ర..

Dalitha Girijana Dandora: నేడు రావిర్యాలలో కాంగ్రెస్ మహాసభ .. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం శ్రేణులు

వర్షాకాలంలో ఏదైనా తినండి.. తినకండి.. కానీ మర్చిపోయి కూడా చేపలు తినవద్దు.. ఎందుకో తెలుసా.. ఇది నిజం తెలిస్తే మీరు కూడా తినరు..