Aadhaar EKYC: ఏపీలో సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులకు EKYC కష్టాలు.. స్పందించిన అధికారులు.. ఏం చేశారో తెలుసా..
ఆధార్‌తో మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా ? సెల్‌ఫోన్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్ లింకైందా ? ఈకేవైసీ పూర్తయిందా ? ఇప్పుడు ఏపీలో ఎవరి నోట విన్నా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు అందుకోవాలంటే..
ఆధార్‌తో మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా ? సెల్‌ఫోన్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్ లింకైందా ? ఈకేవైసీ పూర్తయిందా ? ఇప్పుడు ఏపీలో ఎవరి నోట విన్నా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు అందుకోవాలంటే లబ్ధిదారులకు ఇప్పుడు EKYC కష్టాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ లింక్, సెల్‌ఫోన్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్ లింక్.. ఇలా ప్రతిసారి జరిగే అప్‌డేట్ కోసం జనం మీసేవా కేంద్రాలు, బ్యాంక్‌లు, ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఐదేళ్లు దాటిన పిల్లలకు ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో పిల్లలతో సహా ఆధార్ సెంటర్లు, బ్యాంకులు, మీసేవా కేంద్రాల దగ్గరకు పరుగులు పెడుతున్నారు.
విజయవాడలోని బందర్‌రోడ్డులో ఉన్న కార్వే ఆధార్‌సెంటర్ దగ్గర తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ఐదేళ్లు నిండిన పిల్లలు ఆధార్ అప్‌డేట్, ఈకేవైసీ చేయకుంటే రేషన్‌కార్డు నుంచి పేర్లు తొలగిస్తామని చెప్పడంతో జనం ఆధార్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.
ఒకవైపు కొవిడ్ థర్డ్ వేవ్ భయంతో జనం వణికిపోతుంటే ఇలాంటి సమయంలో ఆధార్ ఈకేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు ఆదేశించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉందంటున్నారు.
ఇటు శ్రీకాకుళం జిల్లాలోనూ EKYC కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంక్‌ల దగ్గర గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. అయితే రోజుకు పది మందికి మించి బ్యాంక్ అధికారులు అప్‌డేట్ చేయడం లేదని చెబుతున్నారు స్థానికులు. బ్యాంక్‌లో ఇతర లావాదేవీల కోసం వచ్చే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నారు.
అయితే శ్రీకాకుళం జిల్లాలో ఈకేవైసీ కష్టాలపై స్పందించారు అధికారులు. జిల్లావ్యాప్తంగా మరో 44 ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పలు గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్ అప్‌డేట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆధార్‌లో మార్చండిలా..
➦ ఆధార్ కార్డు హోల్డర్లు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ https://ssup.uidai.gov.in/ssup/ ఓపెన్ చేయాలి. ➦ Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి. ➦ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ➦ క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ➦ Sent OTP పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ➦ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. ➦ మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ➦ అందులో పుట్టిన తేదీని మార్చాలి. ➦ యూఐడీఐఏ సూచించిన ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ➦ ఏ డాక్యుమెంట్స్‌ని యూఐడీఐఏ అనుమతి ఇస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ➦ ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత Submit పైన క్లిక్ చేయాలి.
➦ మీరు రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ వివరాలను, మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్‌ని పరిశీలించి యూఐడీఏఐ మీ పుట్టిన తేదీని, ఇతర వివరాలను సరిచేస్తుంది. మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
► https://ssup.uidai.gov.in/ssup/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ► Check Update Status పైన క్లిక్ చేయండి. ► ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయండి. ► మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి. ► Check Status పైన క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి: Jana Ashirwad Yatra: ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన యాత్ర..