AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rain Alert: రెయిన్ అలెర్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులపాటు వర్షాలు..

Rain Alert in Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండాయి. కాగా.. అల్పపీడన ప్రభావంతో

AP Rain Alert: రెయిన్ అలెర్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులపాటు వర్షాలు..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Aug 18, 2021 | 10:02 AM

Share

Rain Alert in Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండాయి. కాగా.. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతవారణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఒడిసా- ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ ద్రోణి ఒడిసా, వాయవ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకు విస్తరించినట్లు వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. తీరప్రాంతంలో ఈదురుగాలులు సైతం విచాయి. కాగా.. అల్పపీడన ప్రభావంతో రానున్న రెండురోజుల్లో.. ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటీ, రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు సంభవించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. అటవీ పనులకు వెళ్లిన ప్రజలు వర్షం వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. ఇప్పటికే.. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Also Read:

Neem Leaves Benefits: రుచిలోనే చేదు.. ఆరోగ్య ప్రయోజనాల్లో రారాజు.. వేపాకు లాభాలు తెలిస్తే షాకే..

Garlic Tea Benefits: వెల్లుల్లి టీ తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకవుతారు..

Tulsi Leaves Benefits: తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు.. పరగడుపున ఏ రూపంలో తీసుకున్నా మేలే..