Neem Leaves Benefits: రుచిలోనే చేదు.. ఆరోగ్య ప్రయోజనాల్లో రారాజు.. వేపాకు లాభాలు తెలిస్తే షాకే..
Health Benefits Of Neem Leaves: వేపాకుల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే వేప చెట్టును ఔషధ చెట్టు అంటారు. ఎన్నో ఔషధ గుణాలున్న వేపను
Health Benefits Of Neem Leaves: వేపాకుల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే వేప చెట్టును ఔషధ చెట్టు అంటారు. ఎన్నో ఔషధ గుణాలున్న వేపను ప్రాచీన కాలం నుంచి పలు చికిత్సల్లో, ఔషధాలలో వినియోగిస్తున్నిరు. వేప ఆకుల నుంచి పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు, బెరడు.. అన్నింటిని పలు వ్యాధుల చికిత్సలో, శరీర సౌందర్యానికి వినియోగిస్తారు. అందుకే వేప చెట్టును 21 వ శతాబ్దపు చెట్టుగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అయితే.. రోజూ తాజా వేప ఆకులను నమిలి తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఇనుము, కాల్షియం, ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. వేపఆకులను పలు రకాల సమస్యలను దూరం చేసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. వేప ఆకులను పరగడుపున తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వేప రసం తాగితే ఇన్‌ఫెక్షన్ల నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. వేప ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేపాకు ప్రయోజనాలు.. ∙ వేప ఆకులు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. ∙ పరగడుపున వేప ఆకులు తినడం వల్ల హానికారిక బ్యాక్టీరియాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ∙ వేప ఆకులు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు పోరాడుతాయి. ∙ ఖాళీ కడుపుతో వేప ఆకులు తినడం వల్ల శరీరంలోని విషపూరిత పదార్థాలను, మలినాలు దూరమై.. ఉదర ఇబ్బందులు తలెత్తవు. ∙ కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడకుండా వేపాకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ∙ చుండ్రు సమస్యకు వేపాకు పేస్ట్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని ఆకులు నూరి పేస్ట్ లాగా చేసి జట్టుకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. ∙ చర్మ సమస్యలు, దద్దుర్లు, దురద వంటి ఇబ్బందులను నివారించేందుకు వేపాకు పేస్ట్ మంచిగా పనిచేస్తుంది. ∙ మొటిమలతో ఇబ్బందులు పడే వారు వేపాకు పేస్ట్‌ను.. మొటిమలపై అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Also Read: