Tulsi Leaves Benefits: తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు.. పరగడుపున ఏ రూపంలో తీసుకున్నా మేలే..

Health Benefits of Tulsi Leaves: భారతీయులు తులసి చెట్టును పరమ పవిత్రంగా కొలుస్తారన్న విషయం తెలిసిందే. తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎలాంటి దోషాలు దరిచేరవని

Tulsi Leaves Benefits: తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు.. పరగడుపున ఏ రూపంలో తీసుకున్నా మేలే..
Health Benefits Of Tulsi Leaves
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Aug 18, 2021 | 1:15 PM

Health Benefits of Tulsi Leaves: భారతీయులు తులసి చెట్టును పరమ పవిత్రంగా కొలుస్తారన్న విషయం తెలిసిందే. తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎలాంటి దోషాలు దరిచేరవని విశ్వాసం. అయితే తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులను ఏ రూపంలో తిసుకున్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఔషధాల తులసిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లోని పెరట్లో తులసి మొక్కను కచ్చితంగా ఉంటుంది. తులసి ఆకులను ప్రతిరోజూ తీసుకుంటే.. జలుబు, గొంతునొప్పి, నోటి దుర్వాస‌న‌, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో స‌మ‌స్య‌లు తగ్గుముఖం పడతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తులసి ఆకుల వల్ల కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. తుల‌సి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఒక‌సారి చూద్దాం..

తుల‌సి ఆకు ప్ర‌యోజ‌నాలు.. ⁍ చాలా మందికి నోటి దుర్వాసన స‌మ‌స్య వేధిస్తుంటుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు ప్ర‌తిరోజూ రాత్రి నీళ్ల‌లో తుల‌సి ఆకుల‌ను నాన‌బెట్టి.. ఉద‌యాన్నే ఆ నీటితో ప‌ళ్లు తోముకోవాలి. ఇలా నిత్యం చేయ‌డం వ‌ల్ల నోటి దుర్వాస‌న పోతుంది. ⁍ నోట్లో పొక్కులు, అల్సర్లు కూడా మానిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ⁍ గొంతు నొప్పి సమస్య కూడా చాలా మందిని వేధిస్తుంటుంది. నీరు తాగినా.. ఏదైనా తిన్నా కాని తీవ్రమైన నొప్పి వ‌స్తుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు నీళ్ల‌లో తుల‌సి ఆకులు వేసి బాగా మ‌రిగించాలి. ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని తులసి నీటిని తాగితే.. గొంతునొప్పి తగ్గుతుంది. ⁍ తుల‌సి ర‌సంలో తేనె క‌లిపి తీసుకుంటే మంచి ప్ర‌యోజ‌నాలు కలుగుతాయి. తులసి, తేనెలో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు దూరమవుతాయి. ⁍ ఇలా తీసుకోవడం వల్ల జ‌లుబు, ద‌గ్గు కూడా త‌గ్గుతుంది. ⁍ నోటిపూత‌ సమస్య ఉంటే ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను నమిలి మింగితే.. తగ్గుతుంది. ⁍ రోజూ తుల‌సి ఆకులను తింటే.. శ‌రీరంలో కొవ్వును సైతం తగ్గించుకోవచ్చు. దీంతోపాటు శరీరంలో మలినాలు బయటకు వెళ్లి బరువు కూడా తగ్గుతారు. ⁍ నిద్ర‌లేమి సమస్యతో బాధ‌పడేవారు రోజూ తుల‌సి ఆకుల‌ను తింటే మంచి ఫ‌లితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ⁍ జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడటంతోపాటు.. ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి. ⁍ అందుకే ప్రతిరోజూ తులసి ఆకులను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ⁍ తులసిని ఎలా తీసుకున్నా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

Also Read: Monsoon Hairfall: వర్షాకాలంలో నిగనిగలాడే ఒత్తైన మీ కురుల సంరక్షణ.. శిరోజాల సౌందర్యానికి కొన్ని చిట్కాలు..

Ayurveda Tips-Obesity: ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారా.. పాటించాల్సిన ఆహార నియమాలు, యోగా

భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది