Garlic Tea Benefits: వెల్లుల్లి టీ తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకవుతారు..

Health Benefits of Garlic Tea: ఆధునిక ప్రపంచంలో ప్రతీఒక్కరినీ ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకునేందుకు వంటింట్లోనే అద్భుతమైన

Garlic Tea Benefits: వెల్లుల్లి టీ తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకవుతారు..
Garlic Tea Benefits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 18, 2021 | 7:26 AM

Health Benefits of Garlic Tea: ఆధునిక ప్రపంచంలో ప్రతీఒక్కరినీ ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకునేందుకు వంటింట్లోనే అద్భుతమైన ఔషధాలున్నాయి. అలాంటి వంటింటి ఔషధాల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లిని కూరల్లో వేయటం వల్ల ప్రత్యేక రుచి వస్తుంది. పరిగడుపున వెల్లల్లి రెబ్బలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో విషపదార్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్, యాంటీసెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పరిగడుపున వెల్లుల్లిని తింటే.. బాడీ మెటబాలిజం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.. బరువు నియంత్రణలో ఉంటుంది. హైపర్ టెన్షన్, డయాబెటిస్‌ వ్యాధులను నివారించవచ్చని పరిశోధనలో వెల్లడైంది. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కేన్సర్లను, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి ఔషధమైన వెల్లుల్లిని టీ చేసుకుని తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ టీ తాగడానికి బదులు వెల్లుల్లి టీ తాగితే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వెల్లుల్లి టీ ఉపయోగాలు.. ‣ ఖాళీ కడుపుతో వెల్లుల్లి టీ తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది. ‣ జీర్ణ శక్తి పెంచడంలో కూడా వెల్లుల్లి టీ బాగా ఉపయోగపడుతుంది. ‣ శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపించడంలో వెల్లుల్లి టీ దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. ‣ అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతీరోజూ వెల్లుల్లి టీ తాగితే.. బరువు నియంత్రణలో ఉంటుంది. ‣ బరువు కూడా సులువుగా తగ్గవచ్చు. ‣ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు.. శరీరం చురుకుగా ఉండేలా చేస్తుంది. ‣ శరీరంలో రక్తప్రసరణను పెంచి.. బీపీ అదుపులో ఉండేలా చేస్తుంది. ‣ ఉదర సమస్యలను దూరం చేసి.. అజీర్తి, ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది. ‣ అందుకే ప్రతిరోజూ ఐదారు వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‣ ఘాటు తగ్గించుకునేందుకు కొంచెం తేనె కలుపుకుంటే సరిపోతుంది.

Also Read:

Tulsi Leaves Benefits: తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు.. పరగడుపున ఏ రూపంలో తీసుకున్నా మేలే..

Monsoon Hairfall: వర్షాకాలంలో నిగనిగలాడే ఒత్తైన మీ కురుల సంరక్షణ.. శిరోజాల సౌందర్యానికి కొన్ని చిట్కాలు..

Health Tips: షుగర్ పేషెంట్లు ఏ పండ్లు తినొచ్చు.. ఏ పండ్లు తినొద్దు.. పూర్తి వివరాలు మీకోసం..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?