AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dalitha Girijana Dandora: నేడు రావిర్యాలలో కాంగ్రెస్ మహాసభ .. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం శ్రేణులు

తెలంగాణ పాలిటిక్స్‌లో హుజూరాబాద్ హీట్ కంటిన్యూ అవుతోంది. అధికార పార్టీ దళితబంధుకు కౌంటర్‌గా దళిత, గిరిజన దండోరా సభలు నిర్వహిస్తోంది కాంగ్రెస్..ఇంద్రవెల్లిసభతో సమర శంఖం పూరించింది. అదే ఉత్సాహంతో..

Dalitha Girijana Dandora: నేడు రావిర్యాలలో కాంగ్రెస్ మహాసభ .. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం శ్రేణులు
Telangana Pcc Chief Revanth Reddy
Sanjay Kasula
|

Updated on: Aug 18, 2021 | 8:08 AM

Share

తెలంగాణ పాలిటిక్స్‌లో హుజూరాబాద్ హీట్ కంటిన్యూ అవుతోంది. అధికార పార్టీ దళితబంధుకు కౌంటర్‌గా దళిత, గిరిజన దండోరా సభలు నిర్వహిస్తోంది కాంగ్రెస్..ఇంద్రవెల్లిసభతో సమర శంఖం పూరించింది. అదే ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తోంది. రెండో దళిత గిరిజన దండోరా సభను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. అదే తరహాలో సిటీ శివారు రావిర్యాల సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహంతో మందుకు వెళ్తున్నారు. ఇవాళ నిర్వహించే సభ ఏర్పాట్లు జన సమీకరణపై పార్టీ నేతలు దృష్టిపెట్టారు.

ఈ సభకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ చీఫ్ గెస్టుగా హాజరవుతున్నారు. ర్యావిర్యాల దండోరాను సక్సెస్ చేయడానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు PCC చీఫ్ రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి ముందుగా ఇబ్రహీంపట్నంలో ఈ సభ నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. ఇబ్రహీంపట్నం భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉంటుంది.

CM KCR ప్రకటించిన దళిత బంధు కార్యక్రమానికి కౌంటర్‌గానే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని TPCC చేపట్టిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌లో సోమవారం CM KCR దళితబంధు పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో రావిర్యాల సభ ప్రాధాన్యం సంతరించుకుంది.

దానికి భువనగిరి MP కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకానని స్పష్టం చేయడంతో రేవంత్ రావిర్యాలకు సభను మార్చారు. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభ అక్కడే నిర్వహించి విజయవంతం కావడంతో మళ్లీ అదే జోష్‌లో దళిత, గిరిజన సభను కూడా నిర్వహించి సక్సెస్ చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు..

రావిర్యాల సభకు భారీగా జనసమీకరణ చేయాలని హస్తం పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి, చేవెళ్లతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు సభకు వచ్చేలా చూస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలకు జనసమీకరణపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.

ఇంద్రవెల్లి కంటే రావిర్యాల దళిత, గిరిజన దండోరా విజయవంతం చేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రావిర్యాల తర్వాత హుజూరాబాద్‌లోనే సీఎం నిర్వహించిన ప్లేస్‌లోనే కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా మోగిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ నింపడానికి దళిత, గిరిజన సభలతో ఒకటి మించిన మరో సభలను ఏర్పాటు చేయాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒక్కో సభపై అంచనాలను పెంచుతూ పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Jana Ashirwad Yatra: ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన యాత్ర..

వర్షాకాలంలో ఏదైనా తినండి.. తినకండి.. కానీ మర్చిపోయి కూడా చేపలు తినవద్దు.. ఎందుకో తెలుసా.. ఇది నిజం తెలిస్తే మీరు కూడా తినరు..