Electric Scooter: మూడు చక్రాల ఈ-స్కూటర్.. ఇది స్కూటర్లలో ఎస్ యూవీ.. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 150 కిలోమీటర్లు..
ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఐగోవైజ్ మొబిలిటీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీనికి స్టాండ్ అవసరం లేదు.. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 150 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. అందుకే ఆ కంపెనీ ఈ స్కూటర్ ని ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో ఎస్ యూవీగా ఆ కంపెనీ పేర్కొంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కంపెనీలు వినూత్న పంథాను అవలంభిస్తున్నాయి. మార్కెట్ లో ఈ వాహనాలకు ఉన్న డిమాండ్ ను బేరీజు వేసుకుంటూనే.. ఇతర కంపెనీ లనుంచి పోటీని తట్టుకునేందుకు వినూత్న మోడళ్లను వినియోగదారులకు అందించేందుకు అన్ని దిగ్గజ కంపెనీలతో పాటు పలు స్టార్టప్ లు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఐగోవైజ్ మొబిలిటీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీనికి స్టాండ్ అవసరం లేదు.. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 150 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. అందుకే ఆ కంపెనీ ఈ స్కూటర్ ని ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో ఎస్ యూవీగా ఆ కంపెనీ పేర్కొంది. ఇంతకీ ఈ స్కూటర్ ఏంటి? దాని ఫీచర్లు ఏంటి ఓ సారి చూద్దాం.
బిగో ఎక్స్4 ఎలక్ట్రిక్ స్కూటర్..
ఐగోవైజ్ మొబిలిటీ అనే స్టార్టప్ సంస్థ బిగో ఎక్స్4 పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా లాంచ్ చేసింది. మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకుంటుందే మీకిదే బెస్ట్ ఆప్షన్ కావచ్చు. బిగో ఎక్స్4లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 150 కిలోమీటర్లు వెళ్తుంది. అంతేకాకుండా ఫైర్ రెసిస్టెన్సీ కలిగిన లైఫ్ పీ04 బ్యాటరీలను ఇందులో ఉపయోగించారు.
మూడు చక్రాలు..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బూట్ స్పేస్ 60 లీటర్లు ఉంటుంది. ఇంకా ఇందులో ఇన్‌బిల్ట్ పిలియన్ ఫుట్‌రెస్ట్, స్నేసియస్ ఫ్లాట్ ఫ్లోర్ లెగ్ రూమ్, ట్రిపుల్ డిస్క్ యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఆసక్తికర ఫీచర్లు కూడా ఉన్నాయి. ట్విన్ వీల్ ఇంటిగ్రేటెడ్ పవర్ ట్రెయిన్ టెక్నాలజీ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పని చేస్తుంది. దీని వల్ల ట్రాఫిక్‌లో ప్రయాణం ఈజీగా ఉంటుంది. బ్యాలెన్స్ చేయాల్సిన పని లేదు. స్టాండ్ అవసరం కూడా ఉండదు. వెహికల్ కింద పడిపోదు. రివర్స్ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది.
ఫీచర్లు సూపర్..
ఇంకా ఇందులో స్మార్ట్ బీఎంఎస్, అడాస్, కొల్లిజన్ డిటెక్షన్ అలారం, డేటా డరైవెన్ రైడింట్ ప్యాట్రన్ డిటెక్షన్, ఐఓటీ అండ్ అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే కంపెనీ జీరో డౌన్ పేమెంట్, వెహికల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వంటివి తీసుకువచ్చే అవకాశం ఉంది. అందుకోసం పలు ఫైనాన్స్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది.
ధర ఎంతంటే..
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.1 లక్షల నుంచి ప్రారంభం కావొచ్చు. ఐదేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటుంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో తయారీ ప్లాంటు ఉంది. ఏడాదికి 30 వేల యూనిట్లను తయారు చేసేలా ప్రణాళిక చేస్తున్నారు.
బుకింగ్స్ ప్రారంభం..
కొత్త వెహికల్ ప్రిబుకింగ్స్ కూడా ప్రారంభించింది. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..