AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైం.. టాప్ బ్రాండ్లపై అదిరే ఆఫర్లు..

చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే మార్కెట్ లో వివిధ కంపెనీలకు చెందిన అనేక మోడళ్ల స్కూటర్లు దర్శనమిస్తున్నాయి. వాటిలో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్ లోని బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి ప్రత్యేకతలు, ఆఫర్లను తెలుసుకుందాం.

Best Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైం.. టాప్ బ్రాండ్లపై అదిరే ఆఫర్లు..
Electric Scooter
Madhu
|

Updated on: Oct 13, 2024 | 3:44 PM

Share

ప్రతి కుటుంబానికి ద్విచక్ర వాహనం కనీస అవసరంగా మారింది. వివిధ పనుల కోసం దీని వినియోగం తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. చక్కగా చార్జింగ్ చేసుకునే అవకాశం, పట్టణాల్లోని ట్రాఫిక్ రద్దీలో సులువుగా నడిపే వీలుండడంతో వీటిపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. ఇప్పుడు పండగల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో కొత్త వాహనాలను, వస్తువులను కొనుగోలు చేయడం మన సంప్రదాయం. చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే మార్కెట్ లో వివిధ కంపెనీలకు చెందిన అనేక మోడళ్ల స్కూటర్లు దర్శనమిస్తున్నాయి. వాటిలో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్ లోని బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి ప్రత్యేకతలు, ఆఫర్లను తెలుసుకుందాం.

బెస్ట్ స్కూటర్లు ఇవే..

ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ లో ఓలా, ఏథర్, బజాజ్ చేతక్, హీరో విడా, టీవీఎస్ ఐక్యూబ్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. వీటిని అక్టోబర్ లో కొనుగోలు చేసేవారికి ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ప్రకటించారు. పండగల సందర్బంగా ఈవీలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం.

ఓలా ఎలక్ట్రిక్..

ఓలా ఎస్ 1 ఎక్స్ స్కూటర్ పై కంపెనీ భారీ తగ్గింపు ను ప్రకటించింది. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ఖాతాదారులకు ఆఫర్లు ప్రకటించింది. అక్టోబర్ 4 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఎస్ 1 ఎక్స్ స్కూటర్ కేవలం రూ.49,999కే అందుబాటులోకి వచ్చింది. గతంలో దీని ధర రూ.74,999 ఉండేది. అలాగే ఎస్ 1 వేరియంట్ కు చెందిన మిగిలిన స్కూటర్లపై కూడా రూ.పది వేల తగ్గింపుతో పాటు అదనపు ప్రయోజనాలు అందిస్తోంది. వాటిలో రూ.5 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ.6 వేలు విలువైన 140+ మూవ్ ఓఎస్ ఫీచర్లు, రూ. 7 వేలు విలువైన 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ, రూ.3 వేలు విలువైన హైపర్ క్రెడిట్ చార్జీలు ఉన్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్..

టీవీఎస్ కంపెనీ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.20 వేల వరకూ క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లను ప్రకటించింది. అక్టోబర్ నెలాఖరు వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే రాష్ట్రాన్ని బట్టి ఈ తగ్గింపు మారుతూ ఉంటాయి. 2.2 కేడబ్ల్యూహెచ్ వెర్షన్ పై రూ.17,300, 3.4 కేడబ్ల్యూహెచ్ వెర్షన్ పై రూ.20 వేలు ప్రకటించారు. ఎస్ 3.4 కేడబ్ల్యూహెచ్ వెర్షన్ పై ప్రత్యక్ష్యంగా తగ్గింపులు లేనప్పటికీ రూ.5,999 విలువైన ఐదేళ్లు, 70 వేల కిలోమీటర్ల పొడిగించిన వారంటీ లభిస్తుంది.

ఏథర్..

ఏథర్ స్కూటర్ల పై దసరా సందర్బంగా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏథర్ 450 ఎక్స్, 450 ఎక్స్ అపెక్స్ లకు ఈ ఆఫర్ ద్వారా దాదాపు రూ.25 వేలు విలువైన తగ్గింపు లభిస్తుంది. ఎనిమిదేళ్లు పొడిగించిన బ్యాటరీ వారంటీ, రూ.5 వేలు అథర్ గ్రిడ్ చార్జింగ్ ద్వారా చార్జింగ్ ద్వారా ఏడాది కాంప్లిమెంటరీ చార్జింగ్, ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.పదివేల వరకూ నగదు తగ్గింపు పొందవచ్చు. ఏథర్ 450 ఎక్స్ రెండు రకాల బ్యాటరీ వేరియంట్ల లో అందుబాటులో ఉంది. 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లో లభిస్తుంది.

బజాజ్ చేతక్..

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20 వేల ప్రత్యేక తగ్గింపు ధర అందజేస్తున్నారు. అయితే ఈ ఆఫర్ కేవలం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో దీని ధర రూ.1.45 లక్షల నుంచి 1.15 లక్షల అందుబాటులోకి వచ్చింది. స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే ఆ ఆఫర్ కొనసాగుతుంది. అయితే అమెజాన్ లో కూడా ఈ స్కూటర్ ను బుక్ చేసుకోవచ్చు.

హీరో విడా..

హీరో కంపెనీకి విడా ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఆఫర్ కొనసాగుతోంది. వీ1 ప్లస్, వీ1 ప్రో వేరియంట్లపై అమలవుతోంది. ఇవి అమెజాన్ తదితర ఇ-కామర్స్ ప్లాట్ ఫాంలలో అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రత్యక్ష్యంగా తగ్గింపులు లేవు. ఆన్ లైన్ కొనుగోలుపై రూ.28 వేల వరకూ ఆదా చేసుకోవచ్చు. ఈఎంఐ చెల్లింపులపై రూ.29 వరకూ తగ్గింపు పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..