AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Senior Citizens : సీనియర్‌ సిటిజన్లకు ఈ 3 పథకాలు మంచి లాభాలను అందిస్తాయి..! అవేంటో ఒక్కసారి తెలుసుకోండి..

Senior Citizens : వృద్ధాప్యంలో ఒంటరి వారు కాకూడదనుకుంటే ఎంతో కొంత సేవింగ్స్ తప్పనిసరి. జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. 60 ఏళ్లు పైబడిన పౌరుల కోసం మార్కెట్లో అనేక రకాల పొదుపు పథకాలు ఉన్నాయి.

Senior Citizens : సీనియర్‌ సిటిజన్లకు ఈ 3 పథకాలు మంచి లాభాలను అందిస్తాయి..! అవేంటో ఒక్కసారి తెలుసుకోండి..
Senior Citizens
uppula Raju
|

Updated on: Aug 11, 2021 | 11:27 AM

Share

Senior Citizens : వృద్ధాప్యంలో ఒంటరి వారు కాకూడదనుకుంటే ఎంతో కొంత సేవింగ్స్ తప్పనిసరి. జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. 60 ఏళ్లు పైబడిన పౌరుల కోసం మార్కెట్లో అనేక రకాల పొదుపు పథకాలు ఉన్నాయి. దీని ద్వారా మంచి రాబడి పొందవచ్చు. భారతదేశంలోని పొదుపు పథకాల ద్వారా సీనియర్ సిటిజన్లు అదనపు ప్రయోజనాలను పొందుతారు. వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకించి కొన్ని పొదుపు పథకాలు ప్రారంభించారు. అందులో 3 పథకాలు చాలా ముఖ్యమైనవి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఖాతాను తెరవవచ్చు. 55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు లేదా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, ఉద్యోగం నుంచి VRS తీసుకున్నట్లయితే ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.

మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు.. ఉద్యోగ విరమణ ప్రయోజనాన్ని పొందిన నెలలోపు SCSS పథకం కింద ఒక ఖాతాను తెరవాల్సి ఉంటుంది. SCSS పై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.4 శాతం. ఇందులో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు 1000 నుంచి 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు.

ఆదాయపు పన్ను మినహాయింపు మెచ్యూరిటీ వ్యవధి ముగిసిన తర్వాత SCSS ఖాతాను మరో మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే డిపాజిటర్ అందుకున్న వడ్డీ మొత్తం ఏటా 50 వేల రూపాయలు ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయిస్తారు.

2. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) కింద సీనియర్ సిటిజన్‌లు సాధారణ వడ్డీ కంటే కొంత ఎక్కువ మొత్తం వడ్డీ పొందుతారు. భద్రత పరంగా ఈ పథకం వృద్ధులకు మెరుగైన ఎంపిక. ప్రస్తుతం SBI లో FD వడ్డీ రేట్లు వివిధ కాలపరిమితుల ప్రకారం నిర్ణయించారు. FD లపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు సంవత్సరానికి 6.20 శాతంగా ఉంది. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను విశ్లేషించడం ద్వారా మీరు ఉత్తమ FD ఎంపికను ఎంచుకోవచ్చు. బ్యాంక్ FD ల నుంచి సీనియర్ సిటిజన్లకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50000 వరకు వడ్డీపై పన్ను ఉండదు.

3. ప్రధాన మంత్రి వయ వందన యోజన ప్రభుత్వం సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) ప్రారంభించింది. ఏదైనా సీనియర్ సిటిజన్ మార్చి31, 2023 వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది వృద్ధుల పెన్షన్ పథకం. దీని ఆపరేషన్ LIC తో కలిసి ఉంటుంది. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలు, దాని కాలపరిమితి 10 సంవత్సరాలు. తరువాత పెట్టుబడిదారుడు సజీవంగా ఉంటే పెట్టుబడి మొత్తం చివరి విడత పెన్షన్‌తో పాటు తిరిగి వస్తుంది. ఒక పెట్టుబడిదారుడు 10 సంవత్సరాలలో మరణిస్తే పెట్టుబడి డబ్బు నామినీకి వెళ్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడిపై 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ సంవత్సరం, ఏటా ఏ ప్రాతిపదికన అయినా పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

Viral Photos : ఇండియాలో ఈ 5 సుందర జలపాతాలు..! ఒక్కసారి చూస్తే మైమరచిపోతారు..

‘ప్రపంచ నాయకుల్లారా.. మాకు శాంతి కావాలి.. మమ్మల్ని గందరగోళంలోకి నెట్టొద్దు’: స్టార్ ఆల్ రౌండర్ విజ్ఞప్తి

క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన స్టార్ హీరో.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ…