‘ప్రపంచ నాయకుల్లారా.. మాకు శాంతి కావాలి.. మమ్మల్ని గందరగోళంలోకి నెట్టొద్దు’: స్టార్ ఆల్ రౌండర్ విజ్ఞప్తి

Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. గత నెలలో హెల్మాండ్, కాందహార్, హెరాత్ ప్రావిన్స్‌లలో పౌరులపై జరిగిన దాడుల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.

'ప్రపంచ నాయకుల్లారా.. మాకు శాంతి కావాలి.. మమ్మల్ని గందరగోళంలోకి నెట్టొద్దు':  స్టార్ ఆల్ రౌండర్ విజ్ఞప్తి
Rashid Khan
Follow us
Venkata Chari

|

Updated on: Aug 11, 2021 | 11:08 AM

Rashid Khan: హింస పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశాన్ని విడిచి వెళ్లొద్దని ప్రపంచ నాయకులను కోరుతూ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి కోసం అంతా ముందుకురావాలంటూ సోషల్ మీడియాలో కోరాడు. ‘నా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రతిరోజూ వేలాది మంది అమాయకులు, పిల్లలు, మహిళలు అమరులవుతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. మమ్మల్ని ఇలాంటి గందరగోళంలో పడేయవద్దు. ఆఫ్ఘన్లను చంపడం, ఆఫ్ఘనిస్తాన్‌ను నాశనం చేయడం ఇకనైనా ఆపండి. మాకు శాంతి కావాలి’ అంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాడు

ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. గత నెలలో హెల్మాండ్, కాందహార్, హెరాత్ ప్రావిన్స్‌లలో పౌరులపై జరిగిన దాడుల్లో దాదాపు 1,000 మందిలో కొంతమంది మరణించగా, మరికొంతమంది గాయపడ్డారు. మే 1 న అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాద దాడులు తీవ్రమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని దాదాపు 400 జిల్లాలలో సగానికి పైగా తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. యూఎస్ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన సైన్యాన్ని చాలావరకు ఉపసంహరించుకుంది. ఆగష్టు 31 లోపు తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అమెరికా ఉపసంహరణ తర్వాతే దాడులు.. యూఎస్, నాటో దళాల ఉపసంహరణ ప్రారంభమైనప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ దాడులు పెరిగాయి. అనేక నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాలిబాన్ దాడుల తరువాత, అమెరికాతో పాటు ఆఫ్ఘన్ భద్రతా దళాలు కూడా వైమానిక దాడుల్లో పాల్గొన్నాయి. ఏదేమైనా, ఈ పోరాటం పౌరులకు ప్రాణనష్టం కలిగిస్తోంది. దీనిపై అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాలిబాన్ తిరుగుబాటుదారులు శనివారం జవాజాన్ ప్రావిన్స్ రాజధానిలోకి ప్రవేశించారు. దేశంలోని 34 ప్రావిన్షియల్ రాజధానులలో చాలా వరకు ప్రమాదంలో పడ్డాయి. ఈ మేరకు ఆలోచించాలని రషీద్ ఖాన్ ప్రపంచ దేశాను కోరుతున్నాడు.

Also Read: Abhinav Bindra: 13 ఏళ్ల క్రితం ఒలింపిక్స్‌లో అద్భుతం.. తొలి స్వర్ణంతో భారత్‌ను మురిపించిన అభినవ్ బింద్రా

నీరజ్ చోప్రా అనే పేరుందా..? అయితే ఫ్రీ పెట్రోల్…గుజరాత్ లో ఓ బంక్ యజమాని ‘గోల్డెన్’ ఆఫర్

IPL 2022: వచ్చే ఏడాది బరిలో మరో రెండు జట్లు.. ముగ్గురు ఆటగాళ్లకే అనుమతి?