IPL 2022: వచ్చే ఏడాది బరిలో మరో రెండు జట్లు.. ముగ్గురు ఆటగాళ్లకే అనుమతి?
ఐపీఎల్ 2021 రెండవ సగం మ్యాచ్‌లు యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్నాయి. మిగిలిన 31 మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబి, షార్జాలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది.
IPL 2022: ఐపీఎల్ 2021 యూఏఈలో మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఈమేరకు సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో మిగిలిన 31 మ్యాచ్‌లు జరుగుతాయి. మరోవైపు భారత క్రికెట్ బోర్డు వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 కోసం ప్లాన్ చేస్తోంది. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈమేరకు ఇటీవల ఢిల్లీలో బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీ అధికారుల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, తదుపరి సీజన్‌పై చర్చించారు. బీసీసీఐ రెండు కొత్త జట్ల టెండర్ కోసం చట్టపరమైన అడ్డంకులు తొలగించుకుని, నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ పని పూర్తయ్యే దశలో ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఉన్న జట్ల ఆటగాళ్లను అట్టిపేట్టుకోవడంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి అనుమతించినట్లయితే, కొత్త జట్లకు అన్యాయం జరుగుతుందని చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు బీసీసీఐ టీంలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎనిమిది జట్లు కనీసం ముగ్గురు ఆటగాళ్లను అలాగే అట్టిపెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా, నలుగురు నుంచి ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2021లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌ల కోసం ఆడేందుకు నిర్ణయాన్ని ఆటగాళ్లకే వదిలేసిందంట. క్రికెట్ ఆస్ట్రేలియా ఏ ఆటగాడిని ఆడగాడిని ఆపదంటూ వివరణ ఇవ్వడంతో.. కొంతమంది ఆసీస్ ఆటగాళ్లు సెకండాఫ్‌లో ఆడే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 20 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ బరిలో ఉన్నారు. వీరిలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, రిలే మెరెడిత్, జ్యె రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, మొయిసెస్ ఒన్రిక్వెజ్, గ్లెన్ మాక్స్వెల్ వంటి పేర్లు ఉన్నాయి. అయితే ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ మాత్రం తాను ఐపీఎల్‌లో ఆడడని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబి, షార్జాలో జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల కోసం విదేశీ ఆటగాళ్లు సైతం హాజరుకానున్నారు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఇప్పటికే తమ ఆటగాళ్లను టోర్నమెంట్ ఆడేందుకు అనుమతించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా నుంచి కూగ ఆమోదం లభించింది.
Also Read: IND vs ENG: లార్డ్స్‌లో టీమిండియా బోల్తా.. విరాట్, పుజారా విఫలం.. తొలిసారి బరిలోకి రోహిత్, పంత్
PV Sindhu: పీవీ సింధుకు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పి.. ఘనంగా సన్మానించిన హైదరాబాద్ పోలీసులు