IPL 2021: చెన్నై చేరిన సీఎస్‌కే లయన్.. ఐపీఎల్ సెకండాఫ్‌కి సిద్ధమంటూ సిగ్నల్.. యూఏఈ వెళ్లేది ఎప్పుడంటే..!

ఐపీఎల్ 2021 సెకాండాఫ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సెప్టెంబర్ 19 న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. అంతకు ముందు ధోని టీం ఏడు మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది.

IPL 2021: చెన్నై చేరిన సీఎస్‌కే లయన్.. ఐపీఎల్ సెకండాఫ్‌కి సిద్ధమంటూ సిగ్నల్.. యూఏఈ వెళ్లేది ఎప్పుడంటే..!
Ms Dhoni
Follow us
Venkata Chari

|

Updated on: Aug 11, 2021 | 8:12 AM

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం చెన్నై చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఐపీఎల్ 2021 కోసం జట్టు ఆటగాళ్లు యూఏఈకి వెళ్లనున్నారు. వచ్చే నెలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకండాఫ్ మొదలుకానుంది. యూఏఈలో జరిగే ఈ టోర్నిలో పాల్గొనే భారత ఆటగాళ్లు ఆగస్టు 13 న యూఏఈకి వెళ్లే అవకాశం ఉందని సీఎస్‌కే అధికారి తెలిపారు. సీఎస్‌కే సీఈవో కేఎస్ విశ్వనాథన్ పీటీఐతో మాట్లాడుతూ.. “అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లు ఆగస్టు 13 న యూఏఈకి బయలుదేరే అవకాశం ఉందని” ఆయన వెల్లడించారు. ధోని చెన్నై చేరుకోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

ఈమేరకు సీఎస్‌కే ధోనీ ఫొటోను తన ట్విట్టర్ పంచుకోవడంతో అసలు విషయం తెలిసింది. ‘లయన్ డే ఎంట్రీ’ అంటూ క్యాప్షన్ అందించారు. సీఎస్‌కే ఆటగాళ్లు యూఏఈకి వెళ్లే ముందు చెన్నైలో క్యాంపు ఉంటుందని విశ్వనాథ్ చెప్పారు. ఐపీఎల్ 2021 సెంకాండాఫ్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరుగునున్న సంగతి తెలిసిందే. మేలో బయో సెక్యూర్ బబుల్‌తో సురక్షితమైన వాతావరణంలోనూ ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకడంతో భారత్‌లో నిర్వహించిన ఈ టోర్నమెంట్ మధ్యలోనే వాయిదా పడింది. దీంతో ఐపీఎల్ 2020 ను ఇంతకు ముందు విజయవంతంగా నిర్వహించిన యుఏఈలోనే ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో మిగిలిన మ్యాచులను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో.. సీఎస్‌కే ముంబై ఇండియన్స్‌పై సెప్టెంబర్ 19 న తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ధోని టీం ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. ఐపీఎల్ 2020 తో పోలిస్తే, ఈ సంవత్సరం సీఎస్‌కే టీం మంది ఆటను ప్రదర్శించింది. కరోనా కేసుల కారణంగా టోర్నమెంట్ మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి వరకు జరిగిన మ్యాచులను పరిశీలిస్తే.. చెన్నై టీం ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి బలమైన పోటీదారుగా నిలిచిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు యూఏఈలో ఈ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి. గత సంవత్సరం కూడా టోర్నమెంట్ యూఏఈలోనే జరిగింది. ఆటైంలో చైన్నే టీం ఏడవ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2020 మొదటి సీజన్‌లో చెన్నై జట్టు ప్లేఆఫ్‌కి చేరుకోలేకపోయింది.

Also Read: PV Sindhu: పీవీ సింధుకు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పి.. ఘనంగా సన్మానించిన హైదరాబాద్ పోలీసులు

19 బంతుల్లో హ్యాట్రిక్‌తో సహా 5 వికెట్లు.. 42 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్.. అతనెవరంటే?

Viral Video: ఇలాంటి విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. ఇది చూస్తే షాకవ్వాల్సిందే! వైరలవుతోన్న నీరజ్ చోప్రా వీడియో