70 బంతుల్లో 7గురు బౌలర్ల భరతం పట్టాడు..! 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 140 పరుగులు చేశాడు.. ప్రత్యర్థికి దడ పుట్టించాడు..

Royal London ODI Cup : ఒక బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి జట్టులోని ఏడుగురు బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 70 బంతులను ఎదుర్కొని 140 పరుగులు చేశాడు. అందరిని ఊచకోత కోశాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న

70 బంతుల్లో 7గురు బౌలర్ల భరతం పట్టాడు..! 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 140 పరుగులు చేశాడు.. ప్రత్యర్థికి దడ పుట్టించాడు..
Tim David
Follow us
uppula Raju

|

Updated on: Aug 11, 2021 | 11:53 AM

Royal London ODI Cup : ఒక బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి జట్టులోని ఏడుగురు బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 70 బంతులను ఎదుర్కొని 140 పరుగులు చేశాడు. అందరిని ఊచకోత కోశాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్ టోర్నమెంట్‌లో ఇది జరిగింది. వార్‌విక్‌షైర్ వర్సెస్‌ సర్రే మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ 62 బంతులు మిగిలి ఉండగానే సర్రే జట్టుకు విజయాన్ని అందించాడు. అసలు విషయం ఏంటంటే టిమ్ డేవిడ్ పెద్దగా పేరున్న క్రికెటర్ కాదు. సింగపూర్‌కి చెందిన ఒక సాధారణ క్రికెటర్.

తొలి మ్యాచ్‌లో వార్విక్‌షైర్ బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. వార్‌విక్‌షైర్ బ్యాట్స్‌మెన్ ఎవరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. కానీ ప్రతి బ్యాట్స్‌మన్ ఖచ్చితంగా రెండంకెల స్కోరు చేశారు. సర్రే జట్టు 269 పరుగుల లక్ష్యాన్ని 60 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చిన వెంటనే మొత్తం సీన్ మారిపోయింది. స్కోరుబోర్డులో వేగం పెరిగింది. ఫలితంగా జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

25 ఏళ్ల టిమ్ డేవిడ్ 200 స్ట్రైక్ రేట్‌తో 70 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ఇందులో 11 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. అతడి మొత్తం సిక్స్‌లు, ఫోర్‌లను కలిపితే కేవలం 20 బంతుల్లో 102 పరుగులు అవుతాయి. టిమ్ డేవిడ్ మూడో వికెట్‌కు 56 పరుగులు, నాల్గవ వికెట్‌కు 154 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీ చేసిన టిమ్ డేవిడ్ 140 పరుగులు చేసి వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు సాధించాడు. అంతేకాదు సర్రే జట్టు నాకౌట్ ఆశలు సజీవంగా ఉంచాడు.

Medak Murder: మెదక్ కారు దగ్ధం కేసులో ముగ్గురి అరెస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

Viral Photos : ఇండియాలో ఈ 5 సుందర జలపాతాలు..! ఒక్కసారి చూస్తే మైమరచిపోతారు..

Senior Citizens : సీనియర్‌ సిటిజన్లకు ఈ 3 పథకాలు మంచి లాభాలను అందిస్తాయి..! అవేంటో ఒక్కసారి తెలుసుకోండి..