Solar Panel: ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను అమర్చడానికి ఎంత ఖర్చు అవుతుంది..? సోలార్ ప్యాన‌ల్ బిజినెస్ చేయ‌డం ఎలా?

Solar Panel: చాలా మంది కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే ఎక్కడ నష్టం వస్తుందోనని భయపడుతుంటారు. అందుకే ఏదైనా వ్యాపారం చేయాలంటే పెద్దగా ఆసక్తి చూపరు. ఎందుకంటే సొంత..

Solar Panel: ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను అమర్చడానికి ఎంత ఖర్చు అవుతుంది..? సోలార్ ప్యాన‌ల్ బిజినెస్ చేయ‌డం ఎలా?
Follow us
Subhash Goud

|

Updated on: Aug 11, 2021 | 2:52 PM

Solar Panel: చాలా మంది కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే ఎక్కడ నష్టం వస్తుందోనని భయపడుతుంటారు. అందుకే ఏదైనా వ్యాపారం చేయాలంటే పెద్దగా ఆసక్తి చూపరు. ఎందుకంటే సొంత డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే వ్యాపార రంగంలో దిగుతుంటారు. మధ్య తరగతి వారు వ్యాపారం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారికి లాభం సంగతేమోగానీ పెట్టిన పెట్టుబడైనా వెనక్కి రాలేదంటే అడ్డంగా నష్టపోతాం. అందుకే ఏ వ్యాపారం చేయాలన్నా.. ముందుగా దాని గురించి అవగాహన ఉండాలి. చేసే విధానం తెలిసి ఉండాలి. అయితేనే సక్సెస్‌ అవుతుంటాము. అయితే కొన్ని వ్యాపారాలకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. పైగా వాటిలో లాభాలు భారీగా ఉంటాయి. అలాంటివి ఉంటాయంటే వెంటనే నమ్మలేం. ఈ వ్యాపారాన్ని తక్కువలో తక్కువ రూ.70,000 ప్రారంభించవచ్చు. ఓ పాతికేళ్ల వరకూ ఇంట్లోనే ఉండి హాయిగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

డాబాపైన సోలార్ ప్యానెళ్లు:

ప్రస్తుతం సోలార్‌ ప్యానెల్స్‌ ధర రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. ఈ వ్యాపారం చేయాలంటే బ్యాంకుల నుంచి రుణం కూడా తీసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ తర్వాత కేవలం రూ.60 నుంచి 70 వేలలో మాత్రమే ఇన్‌స్టాల్‌ చేయవచ్చు. దీనికి కేందర్ ప్రభుత్వమే కాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక సబ్సిడీని ఇస్తాయి. అయినప్పటికీ మీ వద్ద పూర్తిగా డబ్బులు లేకపోతే బ్యాంకు నుంచి రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించవచ్చు. సోలార్‌ ప్యానెల్స్‌ కొనుగోలు చేయడానికి మీరు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి అథారిటీని సంప్రదించవచ్చు. దీని కోసం ప్రతి రాష్ట్ర రాజధానితో సహా ప్రధాన నగరాల్లో కార్యాలయాలు ఉంటాయి. అక్కడ మీరు సబ్సిడీ కోసం ఫారమ్‌ తీసుకోవచ్చు. మీరు ప్రైవేటు డీలర్ల నుంచి సౌర ఫలకాలను కూడా పొందవచ్చు.

ఈ వ్యాపారానికి ఇంటిపై కప్పు కావాలి. డాబా ఉంటే మంచిది. అక్కడ సోలార్ ప్యానెళ్లు అమర్చుకోవాలి. వాటి ద్వారా నెల నెలా ఆదాయం వస్తుంది. మీరు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల ద్వారా వచ్చే కరెంటును మీరు గ్రిడ్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేసుకుంటే.. మీకు గ్యారెంటీగా మంచి ఆదాయం వస్తుంది. ఇందుకోసం మీరు రూ.1 లక్ష ఖర్చు పెట్టి.. డాబాపై లేదా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలి. మీ పెట్టుబడికి 30 శాతం సబ్సిడీ ఉంటుంది. అందువల్ల అయ్యే ఖర్చు రూ.70వేలే.

ప్రభుత్వ సబ్సిడీ:

కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేవారికి ఈ సబ్సిడీ ఇస్తోంది. కేంద్రంలోని పునరుత్పాదక ఇంధన శాఖ.. ఈ 30 శాతం సబ్సిడీ ఇస్తోంది. అందువల్ల మీరు రూ.లక్ష పెట్టి సోలార్ ప్యానెళ్లు కొన్నా… వాటికి రూ.30 వేలు డిస్కౌంట్ పొందవచ్చు.

సౌర ఫలకాలు ఎంత‌కాలం ఉంటాయి?

సాధారణంగా సౌర ఫలకాలు జీవిత కాలం 25 సంవత్సరాలు. నిర్వహణలో ఖర్చు ఉండదు. బ్యాటరీని కేవలం 10 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. దీని ధర సుమారు రూ.20వేలు. ఈ ప్యానెల్స్‌ నుంచి ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌ మీకు ఉచితంగా ఉంటుంది. మీ వినియోగం నుంచి మిగిలిన విద్యుత్‌ను కూడా గ్రిడ్‌ ద్వారా ప్రభుత్వానికి లేదా కంపెనీలకు విక్రయించుకోవచ్చు. ఉచిత విద్యుత్‌తో పాటు సంపాదన కూడా ఉంటుంది.

మీరు రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌లను ఇన్‌స్టాల్ చేస్తే, అప్పుడు 10 గంటల సూర్యకాంతి సుమారు 10 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అంటే, ఒక నెలలో 300 యూనిట్ల విద్యుత్. మీ ఇంటి వినియోగం 100 యూనిట్లు కూడా జరుగుతుంటే, మీరు మిగిలిన 200 యూనిట్లను ప్రభుత్వానికి విక్రయించవచ్చు. ప్రతి రాష్ట్రంలో నిర్ణయించిన రేటు ప్రకారం మీకు చెల్లిస్తారు.

ఇవీ కూడా చ‌ద‌వండి:

TikTok: షార్ట్‌ వీడియో యాప్‌ ‘టిక్‌టాక్‌’ మరో రికార్డు నమోదు.. అత్యధికంగా డౌన్‌లోడ్‌ యాప్‌గా.. వెనుకబడ్డ ఫేస్‌బుక్‌..!

RBI: మహిళా సంఘాలకు రిజర్వ్ బ్యాంక్‌ గుడ్‌న్యూస్‌.. ఎలాంటి తనఖా లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..!

వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..
భోజనం చేసిన తర్వాత ఒక చెంచా నిమ్మరసం తాగండి.. లాభాలు తెలిస్తే
భోజనం చేసిన తర్వాత ఒక చెంచా నిమ్మరసం తాగండి.. లాభాలు తెలిస్తే
మెగా వేలంలో టిమ్ డేవిడ్‌ను ఎంతకు కొనుగోలు చేశారంటే?
మెగా వేలంలో టిమ్ డేవిడ్‌ను ఎంతకు కొనుగోలు చేశారంటే?