AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: మహిళా సంఘాలకు రిజర్వ్ బ్యాంక్‌ గుడ్‌న్యూస్‌.. ఎలాంటి తనఖా లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..!

RBI: మహిళా సంఘాలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద స్వయం సహాయక బృందాలకు..

RBI: మహిళా సంఘాలకు రిజర్వ్ బ్యాంక్‌ గుడ్‌న్యూస్‌.. ఎలాంటి తనఖా లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..!
Subhash Goud
|

Updated on: Aug 10, 2021 | 8:19 PM

Share

RBI: మహిళా సంఘాలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద స్వయం సహాయక బృందాలకు ఎలాంటి తాకట్టు లేకుండానే 20 లక్షల రూపాయల వరకు రుణం ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇప్పటి వరకు డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద ఇస్తున్న రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నోటిఫై చేసింది. అయితే మహిళల సహాయంతో బలమైన సంస్థలను నిర్మించడం ద్వారా పేదరికాన్ని తగ్గించడం, జీవనోపాధిని కల్పించడానికి భారత ప్రభుత్వం డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

కాగా, రూ.10 లక్షల కంటే ఎక్కువ రూ.20 లక్షల వరకు స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాల కోసం త‌న‌ఖా కింద ఎలాంటి ఆస్తులు ఉంచుకోకూడ‌ద‌ని, వారి పొదుపు ఖాతాల‌పై ఎటువంటి ఆంక్ష‌లు విధించ‌కూడ‌ద‌ని తెలిపింది. రుణాలు మంజూరు చేసే స‌మ‌యంలో మార్జిన్ కూడా తీసుకోకూడ‌దని, అదేవిధంగా, ఎస్ హెచ్ జిల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు విరుద్ధంగా ఎలాంటి తాత్కాలిక హక్కును మార్క్ చేయరాదు బ్యాంకులకు సూచించింది. రుణాలను మంజూరు చేసే సమయంలో ఎలాంటి డిపాజిట్లను పట్టుబట్టరాదు అని తెలిపింది. మైక్రో యూనిట్స్ (సీజీఎఫ్ఎంయు) పథకం కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ లో ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసిన తరువాత ఆర్‌బీఐ ఈ సర్క్యులర్ జారీ చేసింది.

ఇవీ కూడా చదవండి

Vivad Se Vishwas Scheme: వివాద్ సే విశ్వాస్ పథకం అంటే ఏమిటి.. ప్రభుత్వానికి రూ .53,684 కోట్ల ఆదాయం..!

National Anthem: ‘జనగణమన’ను జాతీయ గీతంగా ఎప్పుడు స్వీకరించారో తెలుసా..?.. చరిత్ర ఏమిటి..?

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ