Vivad Se Vishwas Scheme: వివాద్ సే విశ్వాస్ పథకం అంటే ఏమిటి.. ప్రభుత్వానికి రూ .53,684 కోట్ల ఆదాయం..!

Vivad Se Vishwas Scheme: ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకం వివాద్‌ సే విశ్వాస్‌. ఈ పథకం కింద రూ.53,684 కోట్ల సంపాదన వచ్చిందని సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక..

Vivad Se Vishwas Scheme: వివాద్ సే విశ్వాస్ పథకం అంటే ఏమిటి.. ప్రభుత్వానికి రూ .53,684 కోట్ల ఆదాయం..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 10, 2021 | 3:48 PM

Vivad Se Vishwas Scheme: ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకం వివాద్‌ సే విశ్వాస్‌. ఈ పథకం కింద రూ.53,684 కోట్ల సంపాదన వచ్చిందని సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి తెలిపారు. ఈ పథకం పన్ను చెల్లింపునకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి అవకాశం కల్పిస్తుంది. దీనిలో పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత వివాదాన్ని పరిష్కరించబడుతుంది. లోక్‌సభలో మంత్రి దీనిపై పూర్తి వివరాలు వెల్లడించారు. 1.32 లక్షల డిక్లరేషన్‌లు జరిగాయని, ఇందులో రూ.99,765 కోట్ల వివాదస్పద పన్ను కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం రూ.53,684 కోట్లు సంపాదించింది. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది.

వివాద్ సే విశ్వాస్ పథకం అంటే ఏమిటి?

వివాద్ సే విశ్వాస్ పథకం మార్చి 31 లోగా పెండింగ్‌లో ఉన్న పన్నులను చెల్లించే పన్ను చెల్లింపుదారులకు వడ్డీ, జరిమానాపై పూర్తి మాఫీని అందిస్తుంది. బహుళ ఫోరమ్‌లలో వివాదంలో పన్ను డిమాండ్లు లాక్ చేయబడిన వారికి ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం లక్ష్యం.

వివాద్‌ సేవ విశ్వాస్‌ పథకం నియమం:

పన్ను చెల్లింపుదారులు డిక్లరేషన్‌ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2021 కాగా, ప్రభుత్వం చెల్లింపులు చేయడానికి ఆగస్టు 31 చివరి తేదీగా నిర్ణయించింది. కావాలంటే కొంత వడ్డీ చెల్లించి అక్టోబర్‌ 31లోపు పన్ను చెల్లించవచ్చు. వివాద్‌ సే విశ్వాస్‌ పథకంలో పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను చట్టం కింద ఏదైనా నేరానికి వడ్డీ, జరిమానా, ప్రాసిక్యూషన్‌ కోసం ఏవైనా విచారణల నుంచి మినహాయించబడతాడు. పెండింగ్‌లో ఉన్న పన్ను విషయాలను పరిష్కరించడానికి ప్రభుత్వం మార్చి 17,2020న వివాద్‌ సే పథకాన్ని ప్రారంభించింది.

వివాదస్పద పన్నులు మాత్రమే..

ఈ పథకం కింద, పన్ను చెల్లింపుదారు వివాదాస్పద పన్నులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పన్ను శాఖ ద్వారా ఈ మొత్తానికి వడ్డీ లేదా పెనాల్టీ విధించబడదు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న పన్ను చెల్లింపుదారుడు.. ఈ పథకం వ్యవధి ఎప్పటికప్పుడు పొడిగించబడుతుంది. తద్వారా మరిన్ని కేసులు పరిష్కరించబడతాయి. పథకం కింద నిర్ణయించిన మొత్తానికి, పన్ను చెల్లింపుదారుడు డబ్బు చెల్లించాల్సిన నిర్దిష్ట తేదీని ఎంపిక చేస్తారు.

ఇవీ కూడా చదవండి

Best Recharge Plans: కేవలం రూ.1999కే ఏడాది పాటు వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాలింగ్.. 600 జీబీ డేటా..!

Reuben Singh: తలపాగా మ్యాచింగ్ కోసం 15కుపైగా రోల్స్ రోయిస్ కార్ల కొనుగోలు.. ఎవరు ఇతను?.. ఆయన ఛాలెంజ్ ఏంటి?